Home / SLIDER / ఈ నెల 8 నుంచి ‘ఆరోగ్య మహిళ’
Minister harish rao COMMENTS ON CENTRAL minister nirmala sitaraman

ఈ నెల 8 నుంచి ‘ఆరోగ్య మహిళ’

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి ఈ నెల 8 నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శనివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సీపీఆర్‌, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, ఎస్పీలు, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు వైద్యారోగ్యశాఖ సమగ్ర ప్ర ణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తామ ని వివరించారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక క్లినిక్‌లు ప్రారంభిస్తామని వెల్లడించారు.

వీటిని 1200కు విస్తరించాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షలపై ప్రత్యే క యాప్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తామని తెలిపారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే రెఫర్‌ చేస్తారని చెప్పారు. పెద్దాసుపత్రుల్లో వారి కి సాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్‌లు ఉంటాయని వెల్లడించారు. ఇలా ఆమెకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ విషయంపై మె ప్మా, మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటివరకూ చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్లకు వివరించి, పరీక్షలు, చికిత్స పొందేలా మహిళల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. 8న ప్రారంభించే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat