Home / POLITICS / MLC Kavith : బండి సంజయ్ పై తెలంగాణలో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు..

MLC Kavith : బండి సంజయ్ పై తెలంగాణలో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు..

MLC Kavith బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెపై కొన్ని వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఆడవారిని ఈ రకంగా ఎలా విమర్శిస్తారు అంటూ రాష్ట్రమంతా అతనిపై విరుచుకుపడుతుంది. పలు మహిళా సంఘాలు సైతం బండి సంజయ్ను నిందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారు. ఐపిసి 354a, 504, 509 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అలాగే ఒక్క బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లోనే కాదు.. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, మ‌హిళ‌లు ఆయా పోలీసు స్టేష‌న్‌ల‌లో ఫిర్యాదు చేస్తున్నారు. మహిళను కించపరిచే విధంగా మాట్లాడినందుకు బండి సంజయ్ పై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. కవిత తో పాటు తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇప్పటికిప్పుడే బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని లేకపోతే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదంటూ హెచ్చరిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat