దేశంలోని ఏడు ప్రధాన జాతీయ పార్టీలకు 2021-2022లో అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది.
అయితే పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతం వారినుంచే అందినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు ఈ ఆదాయం లభించింది. వీటిలో బీజేపీకే రూ.1,161 కోట్లు వచ్చాయని ADR సంస్థ తెలిపింది.