Home / SLIDER / BJP కి భయపడితే ఆస్కార్ వచ్చేదా..? – వై. సతీష్ రెడ్డి

BJP కి భయపడితే ఆస్కార్ వచ్చేదా..? – వై. సతీష్ రెడ్డి

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ సాధించిన RRR సినిమా లోని ‘నాటు నాటు’ పాటకి సినిమా టీం కి శుభాకాంక్షలు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ సాధించి భారతదేశ కీర్తిని తెలంగాణ పేరును మరోసారి విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళికి శుభాకాంక్షలు. గేయ రచయిత చంద్రబోస్ గారికి, స్వరకల్పన చేసిన కీరవాణి గారికి ప్రత్యేక అభినందనలు. ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు మేము తీయగలమని RRR సినిమా చాటి చెప్పింది.

అయితే RRR సినిమా విడుదల సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొందరు బిజెపి నేతలు దీనిపై నానా యాగి చేశారు విద్వేషాలు రెచ్చగొట్టారు. సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లను తగలబెడతామంటూ స్వయంగా బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆనాడు బిజెపి నేతలు చేసిన మాటలకు భయపడి ఉంటే నేడు తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ సాధించేదా..? భారతదేశం పేరు తెలంగాణ పేరు ప్రపంచ వేదికపై మారుమోగేదా ? బిజెపి వాళ్లు ప్రస్తుతం అవార్డు రాగానే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

బెదిరించేది వాళ్లే అవార్డు రాగానే సంబరాలు చేసే ద్వంద నీతి బిజెపిది.ఇంత అద్భుతమైన సినిమాని కనీసం ఆస్కార్ కి నామినేట్ చేయాలని సోయి కూడా కేంద్రంలోని బిజెపి సర్కారుకు లేకుండా పోయింది. ఈ సినిమా విషయంలోనూ బిజెపి తన గుజరాత్ ఫార్ములా ని స్వార్థపూరిత బుద్ధిని చూపెట్టుకుంది. గుజరాతీ సినిమా “ఛెల్లో షో”ను ఆస్కార్ కి నామినేట్ చేసింది. RRR సినిమా టీం స్వయంగా ఆస్కార్ కి అప్లికేషన్ పెట్టుకుని పోటీలో పాల్గొన్నది. అదే భారత ప్రభుత్వం నామినేట్ చేసి ఉంటే ఇంకా చాలా గౌరవప్రదంగా ఉండేది. తెలుగుజాతికి తెలుగు సినిమాకి మరింత గౌరవం వచ్చి ఉండేది. కానీ సినిమా అవార్డుల విషయంలోనూ BJP స్వార్థపూరితంగా కక్షపూరితంగా వ్యవహరించింది. ఇది బిజెపి దిగజారుడుతనానికి నిదర్శనం అని వై. సతీష్ రెడ్డి-చైర్మన్, TSREDCO అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat