Home / SLIDER / జగద్గిరిగుట్టలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

జగద్గిరిగుట్టలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సంజయ్ పురి కాలనీ, జగద్గిరినగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు.

అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఏ విధంగా అందుతున్నాయని తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, మారయ్య, వేణు యాదవ్, హజ్రత్ అలీ, ఇందిరా గౌడ్, బాబు గౌడ్, శశిధర్, వెంకటేష్, మెట్ల శ్రీను, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ దాస్, సంజయ్ పురి కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రెటరీ కిట్టు, ప్రవీణ్ గుప్త, వెంకటేష్, దామోదర్, రాము, జగద్గిరినగర్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సెక్రెటరీ చిన్న, సురేష్, ద్రోణచారి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat