ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంతో అ చిత్రం యూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది.
అయితే నిన్న సోమవారం అవార్డుల ప్రదానోత్సవం కంటే ముందు హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన రెడ్ కార్ పెట్ పై ఫొటోలకు ఫోజులిచ్చారు.
అనంతరం రామ్ చరణ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాసన ఇప్పుడు ఆరునెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డకు ఎంతో ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే తను మాకెంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది’ అని హీరో రామ్ చరణ్ అన్నారు.