ఏపీలో అమరావతిలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వైసీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వైసీపీపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వైసీపీకి దూరంగానే ఉన్నానని తెలిపారు. ‘నేను ఎవరికి ఓటు వేస్తాననేది ముందుగా చెప్పను. ఓటు గురించి టీడీపీ, వైసీపీ వాళ్లు నాతో మాట్లాడలేదు’ అని ఆయన పేర్కొన్నారు.