దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కరోనా పాజిటీవ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది.
గత 146 రోజుల్లో ఒకే రోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది.
కాగా, గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు 5,30,824 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా మృతిచెందినవారిలో మహారాష్ట్రలో ముగ్గురు ఉండగా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.