Home / MOVIES / మహారాణి అవతారమెత్తబోతున్న రష్మిక మందన్నా

మహారాణి అవతారమెత్తబోతున్న రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ ..హాట్ బ్యూటీ  రష్మిక మందన్నా  మహారాణి అవతారమెత్తబోతున్నారు. గ్లామర్‌ డాల్‌గా తెరపై అలరించిన ఆమె మహారాణిగా తెరపై సందడి చేయనుందట. దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌   పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్‌ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఛావా’  అనే టైటిల్‌ కూడా అనుకున్నారని టాక్‌ వినిపిస్తోంది.

లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్‌ పాత్రను విక్కీ కౌశాల్‌  పోషించనున్నారు. ఆయన భార్య మహారాణి ఏసుబాయి భోంస్లే పాత్రలో రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం.ఈ చిత్రం కథ, పాత్రలో డెప్త్‌ నచ్చి రష్మిక పచ్చ జెండా ఊపారట. ఇప్పుడు ఆ కాలపు భాష, యాస నేర్చుకోవడం కోసం ఆమె శిక్షణ తీసుకుంటున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

యుద్ధాల కోసం శంభాజీ పక్క దేశాలకు వెళ్లినప్పుడు, రాజమహల్‌లో రాణిగా ఏసుబాయి  ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎలాంటి రాజకీయ వ్యూహాలను రచించారు? అనే కోణంలో కూడా ఈ సినిమా కథ ఉండేలా స్ర్కిప్ట్‌ను రెడీ చేశారట లక్ష్మణ్‌. మరోపక్క విక్కీ కౌషల్‌ నాలుగు నెలలుగా గుర్రపుస్వారీ, కత్తి యుద్దం, విలువిద్య నేర్చుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్‌ ప్రారంభించనున్నారని టాక్‌. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’ సినిమా చేస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat