Home / SLIDER / అపరిచితుల నుంచి మెసేజ్‌లు, లింక్స్‌ వస్తున్నాయా?

అపరిచితుల నుంచి మెసేజ్‌లు, లింక్స్‌ వస్తున్నాయా?

తాను యూకేలో ప్రముఖ హాస్పిటల్‌లో అనస్తీషియన్‌గా పనిచేస్తున్నట్టు మ్యాట్రిమొనీలో పరిచయమైన ఒక వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి నుంచి 22 లక్షలు కొట్టేశాడు. చిన్న టాస్క్‌ పూర్తి చేస్తే వేలాది రూపాయలు వస్తాయంటూ టెలిగ్రామ్‌ యాప్‌లో ఎరవేసి ఒక స్టూడెంట్‌ జేబు నుంచి 45 వేలు ఖాళీ చేసిందో సంస్థ. ఇలా ఒకటీ, రెండు కాదు.. ఆన్‌లైన్‌ స్కామర్ల ఆగడాలు అంతూపొంతూ లేకుండా నిరంతరం సాగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌ కేటుగాళ్లు ముఖ్యంగా భారత పౌరులను టార్గెట్‌గా చేసుకొని వారి జేబులను ఖాళీ చేస్తున్నారు. తమకు ఇటీవలి కాలంలో +251 (ఇథియోపియా), +60 (మలేషియా), +62 (ఇండోనేషియా), +254 (కెన్యా), +84 (వియత్నాం)తో మొదలయ్యే నంబర్ల నుంచి ఈ కాల్స్‌ వస్తున్నట్టు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. వీరి చేతుల్లో మోసపోయి ఫిర్యాదు చేయని వారు వేల మంది ఉన్నారు. ఇలా మోసపోయిన వారిలో విద్యావంతులే అధికంగా ఉండటం గమనార్హం.

వల వేయడానికి ఎన్నో మార్గాలు

ఆన్‌లైన్‌ జాబ్‌లు, పార్ట్‌ టైం జాబ్‌లు, గిఫ్ట్‌లు, లాటరీలు, టాస్క్‌లు, కేవైసీలు, అకౌంట్‌ అప్‌డేట్‌, షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, స్వల్పకాలానికే అధిక వడ్డీ, ఇన్వెస్ట్‌మెంట్‌ ఐడియాలు, మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌లు, యూ ట్యూబ్‌ వీడియోలకు లైక్‌లు ఇలా అనేక మార్గాల ద్వారా పౌరులను నిత్యం మోసం చేస్తూనే ఉన్నారు. అపరిచితుల నుంచి వచ్చిన మెస్సేజ్‌లకు మోసపోయి లక్షలు పోగొట్టుకున్నామంటూ తమకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని వాట్సాప్‌ తెలిపింది. అలాంటి నంబర్లు, ఖాతాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపింది. ఖాతాదారులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్కామ్‌ కాల్స్‌ను వెంటనే బ్లాక్‌ చేసి రిపోర్టు చేయాలని సూచించింది. అలాంటి కాల్స్‌ను బ్లాక్‌ చేసే ఫీచర్‌ వాట్సాప్‌లో ఇప్పటికే పొందుపర్చామని తెలిపింది.

అత్యాశే కారణం

మనిషి అత్యాశను వీడకపోతే నిరంతరం ఇలా మోసాల బారిన పడుతూనే ఉంటాడు. అపరిచిత వ్యక్తులు మనకు లక్షలాది రూపాయల గిఫ్ట్‌లు ఎందుకు ఇస్తారు? నెల రోజుల వ్యవధిలో మన పెట్టుబడి నాలుగు రెట్లు ఎలా అవుతుంది? వీడియోకు లైక్‌ చేస్తే వేల రూపాయలు ఎలా వస్తాయి, మనం కొనని టికెట్‌కు లాటరీ ఎందుకు తగులుతుంది? ఇలాంటి విషయాలు కొద్దిగా విజ్ఞతతో ఆలోచిస్తే చాలు స్కామర్ల బారి నుంచి చాలామంది బయటపడవచ్చు.

ఈ జాగ్రత్తలు పాటించండి

తెలియని నంబర్ల నుంచి వచ్చే అంతర్జాతీయ, జాతీయ కాల్స్‌కు బదులివ్వ రాదు. గిఫ్ట్‌, ఉద్యోగం, పార్ట్‌టైం జాబ్‌ ఇస్తామన్న వారి ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగరాదు. వారితో మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దు. అపరిచితుల నుంచి వచ్చే ఎలాంటి లింక్‌లు కానీ, అటాచ్‌మెంట్లు కానీ క్లిక్‌ చేయొద్దు. వాటిని డౌన్‌లోడ్‌ చేయొద్దు. టాస్క్‌, లాటరీ, డిపాజిట్‌ల పేరుతో ఎవరికీ మీరు డబ్బు చెల్లించవద్దు. ఒక వేళ మీరు కనుక స్కామర్ల చేతిలో మోసపోతే వెంటనే సైబర్‌ క్రైమ్‌ వారికి రిపోర్టివ్వండి. మీరు ఎంత త్వరగా రిపోర్టు ఇస్తే అంత ఫలితం ఉంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat