భూపాలపల్లి మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర మున్సిపాల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గార్ల నాయకత్వంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చెపడుతున్నామని మీడియా సమావేశంలో వారికి ధన్యవాదాలు తెలిపిన భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు ఆదివారం రోజు భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇటీవల గౌ. మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో భూపాలపల్లి మున్సిపాలిటీకి 50కోట్ల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
మాట ఇచ్చిన ప్రకారం ముందుగా రూ.30కోట్లు నిధులు మంజూరు ఇచ్చిన క్రమంలో వాటికి సంబంధించిన వివరాలను మీడియా ముకంగా వెల్లడించారు.రూ.5కోట్లతో భూపాలపల్లి అంబెడ్కర్ సెంటర్ నుంచి OC జుంక్షన్ వరకు బీటీ రోడ్డు,సైడ్ కాలువలు మరియు సెంటర్ లైటింగ్ పనులకు నిదులు కేటాయించారు.
రూ.80లక్షలతో బాంబుల గడ్డ సింగరేణి ప్రధాన రహదారి నుంచి డంపింగ్ యార్డ్ వరకు అంతర్గత రోడ్డు నిర్మాణం.
రూ.1.50కోట్లతో భాస్కర గడ్డ ప్రధాన దారి నుంచి వేశాలపల్లి వరకు అంతర్గత రోడ్డు నిర్మాణం.
రూ.1.75కోట్లతో సీసీ సైడ్ డ్రైన్ నిర్మాణం రామాలయం నుంచి కెటికె 5 ఇంక్లైన్ వరకు.
రూ.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం గాంధీ కాలేజీ నుంచి జంగెడు రోడ్డు వరకు…
రూ.2 కోట్లతో కాశింపల్లి కట్టు కాలువ మీదుగా పెద్ద పోచమ్మ దేవాలయం వరకు బ్రిడ్జ్ తో కూడిన బీటీ రోడ్డు నిర్మాణం.
రూ.4 కోట్లతో మినీ స్టేడియం బ్యాలెన్స్ & ఆడిటోరియం పనులకు కేటాయింపు.
రూ. 4 కోట్లతో IVNMC మిగిలిన పనులకి కేటాయింపు.
రూ.50 లక్షలతో BC కాలనీసీసీ డ్రైన్ ల నిర్మాణం.
రూ.2.50కోట్లతో మిగిలిన పిల్లోని పల్లి నుంచి కొంపల్లి వరకు రోడ్డు వెడల్పు,సెంటర్ లైటింగ్, సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు కేటాయింపు.
రూ.45 లక్షలతో మహబూబ్ పల్లి వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం.
రూ.50 లక్షలతో పుల్లూరు రామయ్య పల్లి వార్డులో అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు కేటాయింపు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు రూ.30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని నిర్ణయం.
పైన ఇచ్చిన పనులకు ఈ రోజే కలెక్టర్ గారి అనుమతులు తీసుకుని టెండర్ లు పిలుస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే గండ్ర