Home / SLIDER / సీఎం కేసీఆర్ పాలనలో పోలీసు శాఖ ఎంతో పురోగతి

సీఎం కేసీఆర్ పాలనలో పోలీసు శాఖ ఎంతో పురోగతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనలో స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందని హోం మంత్రి మహమూద్‌ అలీ  అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు  వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉందని చెప్పారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవం పేరుతో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డీజీపీ అంజనీ కుమార్‌తో కలిసి హోం మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పోలీసు శాఖకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారని తెలిపారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో ఉనారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat