Home / SLIDER / శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద్…

శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ముత్యాల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై తప్పక ఉంటాయన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నవనీత్, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణ, శంకర్, నాయకులు యూసుఫ్, ప్రభాకర్, అమరేందర్ రెడ్డి, కావలి రవి, బైరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat