సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కానీ అతడితో విభేదాల కారణంగా ఏడాది కింద సరూర్ నగర్లోని పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇంటి సమీపంలోని ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తేవడంతో సాయికృష్ణ ఆమెను చంపేశాడు.