Home / NATIONAL / దేశంలో అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు వీళ్లే..?

దేశంలో అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు వీళ్లే..?

ఓట్ల సమయంలో ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్లో రెండు శాతం అంటే 88 మంది శతకోటేశ్వరులని (100 కోట్లు) తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) తాజా నివేదికలో వెల్లడించాయి.

వారిలో ముగ్గురికి రూ.1000 కోట్లకు పైగా ఆస్తులుండగా, ఐదుగురికి రూ.500-1000 కోట్ల ఆస్తులు, 79 మందికి రూ.100-500 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆ సంస్థలు తెలిపాయి. మొత్తం ఎమ్మెల్యేల్లో సుమారు 57 శాతం మందికి రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లు, 21 శాతం మందికి రూ.10-100 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. మొత్తం ఎమ్మెల్యేల్లో 1777 (44 శాతం) మంది క్రిమినల్‌, 1136 (28 శాతం) మంది ఎమ్మెల్యేలు హత్య, అపహరణ, హత్యాయత్నం, మహిళలపై దాడులు, నేర అభియోగాలను ఎదుర్కొంటున్నట్టు ఏడీఆర్‌, ఎన్‌ఈడబ్ల్యూ తమ నివేదికల్లో తెలిపాయి.

Np
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat