టెంపుల్ సిటీగా తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ దేశాల్లోనూ తిరుపతి వైపు అందరి చూపు ఉంటుంది.అలాంటి తిరుపతిలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకునే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా ఎవరో కాదు చెప్పేది. తిరుపతి స్థానికులే చెబుతుంటారు. బుధవారం అభినయ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరమంతా పలు వేడుకలు,అన్న దాన,రక్త దాన,సేవా కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ అభినయ్ ని మరెన్నో ఉన్నత పదవుల్లో చూడాలి కోరుకుంటున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా మరెన్నో పథకాలను సైతం విజయవంతంగా ప్రజలకు అందిస్తు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ నిరంతర శ్రామికుడిగా పేరు తెచ్చుకున్నారు భూమన అభినయ్.
తనకు రాజకీయ పునాదులు వేసిన తిరుపతి పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. తిరుపతిలో మట్టి రోడ్డు లేకుండా చేయాలనే ఆలోచనతో.. తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో భూమన అభినయ్ అడుగు వేస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ , గడప గడపకు తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాడు.
అభినయ్ డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించి కూడా రెండేళ్లు అవుతుంది. సందర్భంగా అభినయ్ మాట్లాడుతూ.. మీ అందరి ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ ఇంటి బిడ్డగా కష్టాల్లో, సుఖాల్లో ఎప్పటికీ నేను తోడుంటా. ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడా చెడ్డ పేరు రాకుండా మన తిరుపతి గౌరవాన్ని పెంచేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అది భూమన కరుణాకర్ రెడ్డి గారి, జగనన్న నాయకత్వంలోనే సాధ్యం. ఆయన అడుగు జాడల్లో నడుస్తాను, తిరుపతి ప్రజలారా..మీకు అండగా ఉంటాం..తిరుపతి ఖ్యాతిని పెంచుదాం అంటూ పిలుపునిచ్చారు.
ఇదే విధంగా అభినయ్ నిత్యం ప్రజల మధ్యనే ఉంటే… స్థానిక ప్రజలు కోరుకుంటున్నట్టు డిప్యూటీ మేయర్ అభినయ్ ని ఎమ్మెల్యే భూమన అభినయ్ గా కూడా త్వరలోనే చూస్తాం.