కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుచిత్ర రోడ్డు లోగల చిరు వ్యాపారం చేసుకునే 262 మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఎమేల్యే కె.పి. వివేకానంద్ గారు తన నివాసం వద్ద కార్యాలయంలో పంపిణి చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వీటి పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీవన కృషి స్ట్రీట్ వెండర్స్ ఆసోషియేషన్ ప్రెసిడెంట్ మహేష్, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జెనరల్ సెక్రెటరీ కృపాలాని, జాయింట్ సెక్రటరీ రవి వర్మ, సూర్య నారాయణ, శివ, ట్రెజరర్ ఏ. రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.