దేశంలో ఉన్న గిరిజనుల పట్ల ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్సీ కవిత శాసనమండలి సాక్షిగా విమర్శించారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న మణిపూర్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సి కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు ఆరు నుంచి 9 శాతానికి పెంచుకున్నామన్నారు. గిరిజనులకు 4 లక్షల 5 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. దీనిద్వారా 1 లక్షా 57 మంది గిరిజన కుటుంబాలకు పోడు భూములపై హక్కులు లభించాయని చెప్పారు.