ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ఈమేరకు కాపీని రాజ్‌భవన్‌కు పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ సమస్యలను ఆంధ్రప్రదేశ్ తీరుగానే పరిష్కరిస్తామని వెల్లడించింది.