ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది.
ఆ సంస్థ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణి భారతిరెడ్డి.. అడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ కు నోటీసులు జారీ చేసింది.
ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ సతీష్ చంద్రశర్మ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేస్తూ ఈ కేసు విచారణను వచ్చే నెల ఇరవై రెండో తారీఖుకు వాయిదా వేసింది.