Home / ANDHRAPRADESH / లోకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్..ఏం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..మంత్రి రోజా ఫైర్..!

లోకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్..ఏం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..మంత్రి రోజా ఫైర్..!

నారావారి పుత్రరత్నం యువగళం పాదయాత్రలో ఎక్కడకు వెళ్లినా..వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. లోకల్ టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను బట్టీపట్టీ…తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో కళ్లు పెద్దవి చేసి, గొంతు చించుకుని మరీ వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నగరిలో తన కుటుంబం నగరిలో దోచుకుంటుందన్న నారా లోకేష్ విమర్శలకు మంత్రి రోజా తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లొకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్…వాడేం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..ఏదో రాసిచ్చింది..చూసి…దాన్ని కూడా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటాడంటూ చురకలు అంటించారు. .నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే..కోర్టులలో కేసు వేయండి అని లోకేష్ కు మంత్రి రోజా ఛాలెంజ్ విసిరారు.

ఈ రోజు నగరిలో మా అన్నలకు ఇళ్లు కూడా లేవు…వాళ్లు జీవితాంతం నాతోనే ఉంటారని స్పష్టం చేశారు..మా రాంప్రసాద్ అన్న నాతో షూటింగ్ లకు వచ్చేవాడు..స్కూల్ కు వచ్చేవాడు..కాలేజీకి వచ్చేవాడు…వాడి జీవితమంతా నా వెనుకే..ఉన్నాడు…ఇప్పుడు పొలిటికల్ గా నాతో ఉన్నాడు…మరో సోదరుడు అందరికంటే పెద్దోడు అయిన కుమారస్వామిరెడ్డి తాను సినిమాలు చేసే టైమ్ లో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూసేవాడని, ప్రొడ్యూసర్ గా ఆర్గనైజ్ చేసేవారని, పాలిటిక్స్ లోకి వచ్చాక..ఎలా ఉండాలి అనేది చూసుకుంటున్నాడని రోజా చెప్పుకొచ్చారు..ఇక తన భర్త సెల్వమణి సౌత్ ఇండియా పెప్సీ అధ్యక్షుడిగా బిజీగా ఉంటారని తెలిపారు. నగరిలో ఆయన క్యాస్ట్ కు సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి…మన మనిషి ఉన్నప్పుడు హెల్ప్ ఫుల్ గా ఉంటారని వాళ్లు నమ్మారు కాబట్టి…ఆయన వాళ్ల కోసం అప్పుడప్పుడు వచ్చి వాళ్లకు చేయాల్సిన సాయం చేస్తూ ముందుకువెళుతున్నారే తప్పా…ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి లేదా ఒక బిల్డింగ్ అయినా..మేం కొన్నాం..కట్టినాం మీరు రుజువులు చూపించండని లోకేష్ కు మంత్రి రోజా సవాల్ విసిరారు.

మాకు వచ్చిన ప్రతీపైసా కూడా…వైట్ అమౌంట్ వస్తుందే తప్పా…దేనికి ఖర్చు పెట్టాం..ఎక్కడ నుంచి వచ్చింది…మాకేం ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నీ కూడా..అసెంబ్లీకి, ఎలక్షన్ కమీషన్ కు సబ్మిట్ చేసామని రోజా తెలిపారు. దానిపై ఏ ఒక్క తప్పు ఉన్నా సాక్ష్యం ఉంటే మీరు కోర్ట్ కేసు వేసుకోవచ్చు అని లోకేష్ కు మంత్రి రోజా సూచించారు…నేను గట్టిగా మాట్లాడుతాను…ప్రజలు నా పక్కన ఉన్నారు ..నేను చెప్పేది నమ్ముతున్నారు కాబట్టి…నాపై బురదజల్లాలనే ప్రయత్నమే కానీ మరొకటి కాదని   స్పష్టం చేశారు. నగరి ప్రజలకు అందుబాటులో ఉండాలనే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలలు ప్రతోడు హైదరాబాద్ లో ఉంటారు…ప్రతి మనిషి హైదరాబాద్ కు వెళ్లి పని చేయించుకోలేడు కదా…నగరి ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టే మేం ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నామని రోజా తేల్చి చెప్పారు. 2018 వరకు నగరిలో తనకు ఇల్లు లేదని…అప్పుడు ఇక్కడ ఉండడం లేదని ఏడ్చారు..2018లో ఇల్లు కట్టుకుని వచ్చిన తర్వాత..ఇక్కడ దోచేసుకుని ఇల్లు కట్టారని అంటారు..టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేనేట్లా దోచుకుని ఇల్లు కట్టుకుంటానో నాకేతే అర్థం కాలేదంటూ లోకేష్ విమర్శలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat