చెప్పేది శ్రీరంగనీతులు..దూరేది…గుడిసెలు అన్నట్లు ఉంటుంది…మన టీడీపీ అధినేత చంద్రబాబు గారి వ్యవహారం..పొద్దున లేస్తే నేను నిప్పు…నాకంటే నిజాయితీపరుడు ఎవడూ లేడంటూ బాబుగారి బిల్డప్పులకు కొదువ ఉండదు..కానీ చేసేది అన్నీ కొడుకు పప్పుతో కలిసి తుప్పు పనులే…అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబే అంటూ ప్రత్యర్థులు చెబుతుంటారు. తాజాగా టీడీపీ హయాంలో జరిగిన అక్రమ ముడుపుల వ్యవహారంలో బోగస్ కంపెనీల ద్వారా రూ.118 కోట్లు బ్లాక్ మనీ రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలపై ఐటీ శాఖ చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు చంద్రబాబు మీద ఉన్నాయన్నది తెలిసిందే. ఈ క్రమంలో.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించడం విశేషం. షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో ఐటీ రైడ్స్ సమయంలో అసలు విషయం బయటపడింది.
2017లో బాబు హయాంలో షాపూర్ జీ సంస్థ తరపున ఎంవీపీ టెండర్ వేశారు. ఎంవీపీ కంపెనీ, అనుబంధ సంస్థపై 2019లో సోదాలు నిర్వహించింది. ఐటీ శాఖ. ఆ సమయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ పేరుతో నిధులు మళ్లించిన విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఎంవీపీ కార్యాలయం నుంచి కీలక పత్రాలు, ఎక్సెల్‌షీట్లు, కీలకమైన మెసేజ్‌లు స్వాధీనం చేసుకున్నారు కూడా. ఇక నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ఐటీ.. మళ్లిన ఆ నిధులు చంద్రబాబుకు చేరినట్లు అభియోగం నమోదు చేసింది. 2016లో ఆగష్టులో చంద్రబాబు నాయుడు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి.. పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ ఐటీకి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఈ క్రమంలో బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం కూడా ఇచ్చాడు. చంద్రబాబు ప్రభుత్వంలో బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారు కూడా. అందుకే తాజా నోటీసుల్లో.. ఇన్‌ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగా(వెల్లడించని)ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును కోరింది ఐటీ శాఖ. అంతకు ముందు రీ అస్సెస్ చేయాలని చంద్రబాబు కోరగా.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించింది ఐటీ శాఖ. చంద్రబాబు వద్ద ఉన్న రూ. 118 కోట్లను ఐటీ శాఖ బ్లాక్ మనీగానే గుర్తించింది. దీనిపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కాగా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో ఈ అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ విషయాన్నే ఐటీ శాఖ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడించింది కూడా. ఇక.. చంద్రబాబు నేర చరిత్ర ఇదే కాదు.. ఇంకా చాలా ఉంది. .ఇప్పటీకి చంద్రబాబును సుప్రం కోర్డుతో సహా, ఏ కోర్ట్ శిక్షించదని, తెలుగు తమ్ముళ్లు గర్వంగా చెప్పుకుంటారు..ఐటీ, ఈడీ, సీబీఐ, న్యాయస్థానాల్లో సైతం తన మనుషులను జొప్పించిన చంద్రబాబు ఇన్నాళ్లు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు..పైకి పెద్ద మనిషిలా నటిస్తూ..లోలోప మాత్రం వేల కోట్లు అప్పనంగా మింగేసిన ఘరానా చరిత్ర చంద్రబాబుది..ఇప్పుడు రోజులు మారాయి..ఒక్కొక్కటిగా చంద్రబాబు పాపాల పుట్ట పగులుతూనే ఉంటుంది..