Home / ANDHRAPRADESH / బీజేపీ భయం అదే…జమిలి ఎన్నికలపై తలసాని సంచలన వ్యాఖ్యలు..!

బీజేపీ భయం అదే…జమిలి ఎన్నికలపై తలసాని సంచలన వ్యాఖ్యలు..!

దేశ రాజకీయాల్లో మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్…జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ను జరుపనున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ పార్లమెంట్ సెషన్ లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి..రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఫిబ్రవరిలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జమిలీ ఎన్నికలను కేంద్రం నిర్వహించడానికి సిద్ధమైందనే ఊహగానాలు ప్రారంభమయ్యాయి. అయితే జమిలి ఎన్నికల వెనుక ప్రాంతీయ పార్టీలను కట్టడి చేయాలన్న మోదీ వ్యూహం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరగడం వల్ల…ఆయా రాష్ట్రాలలో స్థానిక అంశాలు, ప్రాంతీయ పార్టీల అధినేతల వ్యక్తిగత ఛరిష్మా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాలన, ఆయా రాష్ట్రాలలో అమలవుతున్న సంక్షేమ పథకాలే ప్రభావం చూపుతాయి..అదే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రాంతీయవాదం కంటే జాతీయవాదం ప్రభావం ఎక్కువగా ఉంటుంది..సరిగ్గా ఎలక్షన్లప్పుడు ఏ పుల్వామో ఘటనో, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఘటన జరిగితే..అయోధ్య రామమందిరం ప్రారంభం వంటి జాతీయ అంశాలు కేంద్రంలోని బీజేపీకి ప్లస్ అవుతాయి..మోదీ వ్యక్తిగత ఛరిష్మా కూడా ప్రభావం చూపుతుంది..ఇక దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది..పెరిగిన ధరలపై సామాన్య ప్రజలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ పుంజుకున్నారు..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఆదరణ పెరుగుతోంది. కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీకి అంతటా రివర్స్ గేర్ లో నడుస్తోంది…కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి బలపడితే వచ్చేసారికి బీజేపీకి గెలుపు కష్టమే.. అందుకే మోదీ సర్కార్ జమిలి ఎన్నికలకు మొగ్గు చూపుతుందని తెలుస్తోంది.

కాగా జమిలి ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టి…మళ్లీ అధికారంలోకి వచ్చి…ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు..అయితే ఉన్నట్లుండి పిడుగులా జమిలి ఎన్నికలను మళ్లీ కేంద్రం తెరమీదకు తీసుకురావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఖంగు తిన్నాయి. జమిలి ఎన్నికలు వస్తే కేసీఆర్ ఒక్క తెలంగాణకే పరిమితం అవుతారు..పార్టీ బలపడుతున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం కష్టమవుతోంది. కనీసం ప్రచారం చేసేందుకు కూడా సమయం ఉండదు..అందుకే జమిలి ఎన్నికలను బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు పెట్టాలని కేంద్రం ఆలోచిస్తుందని.. ఎలక్షన్ కమీషన్ కు రిక్వెస్ట్ చేస్తున్నామని వెల్లడించారు. మీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపండని కోరారు. ప్రత్యేకంగా పార్లమెంట్ పెట్టేది జమిలీ ఎన్నికల బిల్ కోసమే అన్న అనుమానం వస్తుందని తలసాని అన్నారు. రేపు షెడ్యూల్ ఇచ్చి.. పదిహేను రోజుల్లో ఎన్నికలు అయినా మేము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ చివరాఖనున లేదా డిసెంబర్ లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతాం అని బీజేపీ భయపడుతుందని , అందుకే జమిలి ఎన్నికలను తెరమీదకు తీసుకువచ్చిందని తలసారి మోదీ సర్కార్ పై చురకలు అంటించారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా… బీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధిస్తుందని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాను అనుకున్నట్లుగా రాజ్యాంగ సవరణ చేసి జమిలి ఎన్నికలను నిర్వహిస్తుందా లేదా..ప్రతిపక్షాల అభ్యంతరాలకు వెనక్కి తగ్గుతుందా అనేది చూడాలి.

 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat