తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు షురూ అయినయి..తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వెన్నుముక ఉండదు..అధికారం కోసం జీ గులాం అంటూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల పాదాల వద్ద తాకట్టు పెడుతుంటారని తరచుగా విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అధికారంలో ఉన్నా…లేకున్నా కాంగ్రెస్ నాయకులకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హస్తినకు వెళ్లాల్సిందే..అక్కడ తమ బాసులకు వంగి వంగి సలాంలు కొట్టాల్సిందే..కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు ఊహల పల్లకీలలో ఊరేగుతున్నారు. అందుకే కాంగ్రెస్ నాయకులు పోలోమంటూ ఢిల్లీకి పరిగెడుతున్నారు. అయితే కర్నాటక ఎన్నికల తర్వాత ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా టీ కాంగ్రెస్ నాయకుల రాజకీయాలు నడుస్తున్నాయి.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నారు. డీకే ప్రాపకం ఉంటే చాలు తాము అందలం ఎక్కినట్లే అని టీ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అందుకే పార్టీ జాయినింగ్స్ నుంచి, టికెట్ల పైరవీల వరకు బెంగళూరుకు పోలోమంటూ పరిగెడుతూ డికే చుట్టూ తిరుగుతున్నారు. ఇటు షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలన్నా…తుమ్మల వంటి నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోవాలన్నా..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సహా అందరూ .బెంగళూరుకు పోవాల్సిందే..డీకే అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు కాయాల్సిందే..గతంలో హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్లే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో పైరవీలు చేయించుకుని, ఆ వెంటనే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్ల దగ్గర మోకరిల్లుతున్నారు..
తాజాగా ఇదే విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత టీ కాంగ్రెస్ నాయకుల తీరుపై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్న హస్తం పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా మారిన కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు అంటూ కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బెంగళూరు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని పేర్కొంటూ డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోను కవిత షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం అని ధ్వజమెత్తారు. ఢిల్లీ, గల్లీలలో మోకరిల్లడం కాంగ్రెస్ పార్టీ నైజం అంటూ ఆమె నిప్పులు చెరిగారు. ప్రస్తుతం టీ కాంగ్రెస్ నాయకుల తీరుపై ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.