Breaking News
Home / NATIONAL / శివలింగాన్ని అవమానించిన బీజేపీ మంత్రి

శివలింగాన్ని అవమానించిన బీజేపీ మంత్రి

యూపీకి చెందిన మంత్రి సతీశ్ శర్మ శివలింగం వద్ద చేతులు కడగటం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టిస్తుంది.  యూపీ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సతీశ్ శర్మ ,మరికొంతమంది మంత్రులు.. బీజేపీకి చెందిన నేతలతో ఇటీవల రామ్ నగర్ తెహసీల్ లోని హెత్మాపూర్ గ్రామంలో లోధేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని గత నెల ఇరవై ఏడో తారీఖున సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయితే ఈ సందర్భంగా ఆయన తన చేతులను శివలింగం వద్ద కడిగిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఘటన పట్ల కాంగ్రెస్ ఎస్పీ పార్టీలు మండిపడుతున్నాయి.  మంత్రి సనాతన ధర్మాన్ని అవమానించారు. ఆయన తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఘటనపై బీజేపీ నేతలు స్పందిస్తూ మంత్రి తన చేతులకు ఉన్న ఎర్రచందనాన్ని దేవుడికి నైవేద్యంలా లింగం పక్కన కడిగారు తప్ప అందులో ఎలాంటి తప్పు లేదని వాదిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino