గులాబీ బాస్ , బీఆర్ ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటనతో తెలంగాణలో కొద్ది రోజులుగా వేడెక్కిన ఎన్నికల వాతావరణం..ఇప్పుడు జమిలి ఎన్నికల ఊహాగానాలతో ఒక్కసారిగా చల్లబడింది..దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడం, మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి బలపడడంతో ఈ డిసెంబర్‌లో జరగాల్సిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిందామీద పడుతోంది..తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్ లలో షెడ్యూల్ ప్రకారం నవంబర్ నెలాఖరులోగా, లేదా డిసెంబర్ 2 వ వారం లోపు ఎన్నికలు జరగాల్సింది..కానీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క మధ్యప్రదేశ్ లో తప్పా..మిగిలిన రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం వచ్చే జనరల్ ఎన్నికలపై పడుతుందని బీజేపీ పెద్దలకు భయం పట్టుకుంది..అందుకే జమిలి ఎన్నికల అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచక్చి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది..ఈ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించి అయినా జమిలి ఎన్నికల బిల్లును పాస్ చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి…దీంతో డిసెంబర్‌లో జరగాల్సిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వాయిదా పడతాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి..
తాజాగా ఇదే అంశంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై అధారపడి ఉందని , అక్టోబర్ 10లోపు నోటిషికేషన్ వస్తేనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, అయితే సమయంలోగా నోటిఫికేషన్ వచ్చేది అనుమానమేని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్, మేలో జరగవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తరువాతే తెలంగాణ ఎన్నికలపై క్లారిటీ వస్తుందని అన్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై(మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయపడుతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సదరు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని అనుకుంటున్నారని, అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అయితే మధ్యప్రదేశ్‌లో ఒక్క దగ్గరే బీజేపీకి అవకాశం ఉందన్నారు. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం కష్టమేనని కేటీఆర్ కుండబద్ధలు కొట్టారు.,.కాగా జమిలి వచ్చినా భయపడేది లేదని… తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ వైపే ఉన్నారన్న మంత్రి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే బీఆర్ఎస్‌కే ప్లస్ అని స్పష్టం చేశారు.. తమ పార్టీ మహారాష్ట్రలోనూ పోటీ చేస్తుందని, జాతీయ పార్టీలకు చుక్కలు చూపించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారం కాకుండా…ఏప్రిల్, మేలో జరగవచ్చు అన్న కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. మరి తెలంగాణలో కూడా జమిలి ఎన్నికలు ఒకేసారి జరగవచ్చు అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.