Home / ANDHRAPRADESH / హైకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ…ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా

హైకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ…ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి..చంద్రబాబును ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూత్రా ఎత్తులన్నీ..సీఐడీ న్యాయవాదుల వాదనల ముందు తేలిపోతున్నాయి..హౌస్ అరెస్ట్ పిటీషన్, క్వాష్ పిటీషన్, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్, ఇలా వరుసగా చంద్రబాబు తరపు న్యాయవాదుల వేస్తున్న పిటీషన్లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే క్వాష్ పిటీషన్ ను ఈ నెల 19 వరకు వాయిదా వేసిన హైకోర్టు ఇప్పుడు అంగళ్లు విధ్వంసం కేసులో తనను అరెస్ట్ చేయకుండా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌‌పై విచారణను ఈ నెల 20 వరకు వాయిదా వేసింది. అన్నమయ్య జిల్లా, అంగళ్లు వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్ర బాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ మేరకు ఇవాళ ఉదయం విచారణ జరిపిన హైకోర్ట్ బెంచ్..ఈ పిటీషన్ పై విచారణను ఈ నెల 20 కి వాయిదా వేయడంతో చంద్రబాబు బ్యాచ్‌ ఖంగుతింది. పుంగనూరులో రోడ్ షో సందర్భంగా నిరసన తెలుపుతున్న రైతులు, వైసీపీ నేతలు, కార్యకర్తలపై చంద్రబాబు రెచ్చిపోయాడు.. ఏం తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. వాహనంపై ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి తదితర నేతలు కూడా వైఎస్సార్‌సీపీ నేతలవైపు చేతులు చూపుతూ, కేకలు వేస్తూ హెచ్చరికలు చేస్తూనే.. సైగలతో దాడులకు ప్రేరేపించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఈ దాడులు చేయించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే సిద్ధం చేసుకున్న మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, దాడిని అడ్డుకోబోయిన పోలీసులు కూడా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, మహేష్, ఓ విలేకరి శ్రీనివాసులు, ముదివేడు పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. రోడ్డుపై పగిలిన బాటిళ్లు, ఇటుకలు, కర్రలు పడి ఉన్నాయి. కొందరు స్థానికులు వైఎస్సార్‌సీపీ నేతలను రక్షించారు.

అంగళ్లు విధ్వంసంలో పోలీసులు చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసింది. ఆగస్టు 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డీఆర్‌.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద ఎస్‌ఐ షేక్‌ ముబిన్‌తాజ్‌ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఏపీ ఫైబర్ నెట్ స్కాం, అమరావతి భూకుంభకోణం, టిడ్కో ఇళ్ల స్కామ్, అంగళ్లు విధ్వంసం కేసు..ఇలా వరుస కేసుల్లో రిమాండ్ కోసం సీఐడీ కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేయనుంది..దీంతో బాబు బ్యాచ్‌లో వణుకు మొదలైంది..అందుకే అంగళ్లు కేసులో అరెస్ట్ కాకుండా..ముందస్తు బెయిల్ పిటీషన్ పెట్టుకోగా..హైకోర్టు తాపీగా ఈ నెల 20 వరకు వాయిదా వేయడంతో టీడీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat