Home / ANDHRAPRADESH / గ్లాసు గుర్తు ఎందుకు పవనూ..సైకిలే తీసుకుంటే పోలా…!

గ్లాసు గుర్తు ఎందుకు పవనూ..సైకిలే తీసుకుంటే పోలా…!

జనసేన పార్టీకి మళ్లీ గ్లాసు గుర్తు వచ్చింనందుకు అధినేత పవన్ కల్యాణ్‌తో సహా..జనసైనికులు మురిసిపోతున్నారు..గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 137 స్థానాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా ఆ పార్టీ అభ్యర్థులంతా ఘోర పరాజయం పాలయ్యారు. ఒక్క రాజోలులో జనసేన తరపున గెలిచిన రాపాక వర ప్రసాద్‌రావు..ఆ వెంటనే అధికార వైఎస్ఆర్‌సీపీలో చేరారు. దీంతో అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది..ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న టైమ్‌లో గాజు గ్లాసు గుర్తును మళ్లీ జనసేన పార్టీకి సీఈసీ కేటాయించడంతో పవన్‌తో సహా జనసైనికులు ఆనందంతో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా “జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు’’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. అయితే పార్టీ పెట్టి పదేళ్లు అయినా ఇన్నాళ్లు జనసేన పార్టీకి అధికారికంగా గాజు గ్లాసు సింబల్‌‌ను దక్కించుకోలేకపోవడం పవన్ వైఫల్యమే..చంద్రబాబు దత్తపుత్రుడిగా టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్న ప్యాకేజీ స్టార్…సొంత పార్టీ భవిష్యత్తు, నేతల బతుకులతో చెలగాటం ఆడుతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న దత్త తండ్రి చంద్రబాబును చూసి ఎమోషనల్ అయిపోయిన పవన్ కల్యాణ్…బయటకు వచ్చి వీరావేశంతో సొంత పార్టీ నాయకులకు చెప్పాపెట్టకుండా..తనను సీఎంగా చూడాలన్న లక్షలాది మంది అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ…కాపుల ఆత్మగౌరవాన్ని కమ్మ కుల గురువు అయిన చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెడుతూ… టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకున్నాం..రాబోయే ఎన్నికల్లో పొత్తు ద్వారా జగన్‌ని చిత్తు చేస్తున్నాం..జగన్ నీకు ఇంకో ఆర్నెళ్లే టైమ్ అంటూ రెచ్చిపోయాడు..

అయితే తాజాగా ఈ ఏడాది మార్చిలో పోయిన గాజు గ్లాసు గుర్తు రావడంపై జనసేన శ్రేణులు సంబరాలు చేసుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సెటైర్లు వేశారు..మళ్లీ గ్లాసు ఎందుకు పవనూ..సైకిలే తీసుకుంటే పోలా..అంటూ అంబటి పవన్‌ని ఉద్దేశిస్తూ…మాంచి సెటైరికల్ ట్వీట్ చేశారు..ఎలాగూ టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉన్నా..సీట్లను ఖరారు చేసే అధికారం పవన్‌కు ఉండదూ..చంద్రబాబు విదిలించిన ముష్టి సీట్లు పవన్‌కు ఇష్టం ఉన్నా..లేకున్నా తీసుకోవాల్సిందే..అంతెందుకు జనసేనకు కేటాయించిన సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేసేది కూడా చంద్రబాబే..ఇందులో ట్విస్ట్ ఏంటంటే..జనసేనకు కేటాయించే సీట్లు ముందుగా తన పార్టీ వాళ్లకు సమాచారం అందించి…వారితో పార్టీకి రాజీనామా చేయించి..జనసేనలో చేరేలా చేసి…అక్కడ జనసేన తరపున టికెట్ కేటాయిస్తాడు..అంటే పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో కూడా పోటీ చేసేది చంద్రబాబు మనుషులే..అందుకే అంబటి రాంబాబు ఇలా జనసేనకు గాజు గ్లాస్ ఎందుకు…అదేదో టీడీపీ సైకిల్ గుర్తును తీసుకుంటే పోయేది పవన్‌కు అదిరిపోయే పంచ్ విసిరారు…అంబటి దెబ్బకు పవన్ కల్యాణ్ మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat