తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు ఈరోజు శుక్రవారం స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వనం రమేష్, వనం మాలతి దంపతులు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి కార్యదర్శి గోల్నాక నుంచి జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసిన కత్తుల సుదర్శన్ రావు ఇద్దరు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నేత పి. గెలవయ్య తదితరులు పాల్గొన్నారు.