సరిగ్గా దాదాపు మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ కనుమరుగైపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదల ఉలిక్కిపడేలా చేస్తోంది.
భారత్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుదల కనిపించింది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 166 కొత్త కేసులు వెలుగుచూశాయి. చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.