Home / MOVIES / ‘నా సామిరంగ’ టీజ‌ర్

‘నా సామిరంగ’ టీజ‌ర్

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జుననటిస్తున్న పూర్తిస్థాయి మాస్‌ చిత్రం ‘నా సామిరంగ’. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా న‌టిస్తుండ‌గా.. విజయ్‌ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్‌, అల్లరి న‌రేష్ ఇంట్రోను చిత్రబృందం విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇదిలావుంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ను తాజాగా చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ”ఏమి చేస్తున్నాడేంటి మీవోడు. నిన్ననే మామిడితోటలో ఇరవైమందిని ఉతకొట్టుడు కొట్టేసాడు” అంటూ ఆషికా రంగనాథ్‌, న‌రేష్ సంభాషణలతో టీజ‌ర్ మొదలవుతుంది. టీజ‌ర్ చూస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఫుల్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సాగిన ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో యువ న‌టుడు రాజ్ త‌రుణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat