కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆయన తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గెలిచిన ఓ ఎమ్మెల్యే టీడీపీకి రిజైన్ చేయడంతో ఆ సంఖ్య కాస్త 22కి పడిపోయింది. మరికొన్ని రోజుల్లో టీడీపీకి చెందిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది.
