అర్హులైన గొల్ల కురుమలకు ఇప్పటి వరకు 26 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. రాష్ట్రంలోని గొల్లకురుమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తెలిపారు. వీరిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. గొర్రెల పంపిణీతో పాటు మేత, ఔషధాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 100 పశు సంచార వైద్యశాలలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.గొర్రెల పంపిణీ పథకం విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర మంత్రులు సీఎం కేసీఆర్‌ను కలిసి అభినందించారని మంత్రి తలసాని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో కూడా గొర్రెల పంపిణీ పథకం లేదన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే బడుగుబలహీన వర్గాలకు స్వాతంత్య్రం వచ్చిందని అయన పేర్కొన్నారు.
