ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు వర్షం కురిపించారు . యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మంత్రి యనమల ప్రశంసించారు . ఇవాళ ఆదివారం అయన యదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు .అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలను అభివృద్ది చేయడమంటే చరిత్రను కాపాడటమేనన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని లక్ష్మీ నరసింహస్వామిని కోరుకున్నా. యాదాద్రి దేవస్థానానికి గొప్ప చరిత్ర ఉంది.వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి ప్రధాత అని యనమల కొనియాడారు . ఏపీకి తిరుమల వలె తెలంగాణకు యాదాద్రి క్షేత్రం తలమానికంగా నిలవాలని ఆశిస్తున్నానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు.