గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు టూర్ లో భాగంగా ఆదివారం చెన్నై పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే.ఈ పర్యటన సందర్భంగా సీ ఎం కేసీఆర్ కు అక్కడి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు .సీఎం కేసీఆర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టు, కరుణానిధి నివాసం, స్టాలిన్ నివాసం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు . దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ తమిళంలో, హిందీలో పెద్ద ఎత్తున …
Read More »దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి..సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నై పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రెసిడెంట్ కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్… డీఎంకేతో మొదటి యూపీఏ ప్రభుత్వంలో పని చేసినట్లు గుర్తు చేశారు. భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్నారు. కేంద్రం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు . స్టాలిన్ తో చాలా విషయాలు చర్చించామన్నారు. ఇది ప్రారంభం కాదు..ముగింపుకాదు మా స్నేహం …
Read More »ఫెడరల్ ఫ్రంట్..కీలక బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్
దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం..,తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు …
Read More »కరుణానిధితో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్, డీఎంకే శ్రేణులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి …
Read More »హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నది ఒక్క జగనే..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా కు ఉరి వేసిన ఘనుడు చంద్రబాబే అని విమర్శలు గుప్పించారు .ధర్మ పోరాటం పేరిట చంద్రబాబు చేసింది అంతా డ్రామా మాత్రమేనని మోడీ సర్కార్ తో మరోసారి లాలూచీ కి టీడీపీ పార్టీ తహతహలాడుతుందని అన్నారు . స్వార్థ …
Read More »కేంద్రం బుద్ధిని బయటపెట్టిన మంత్రి కేటీఆర్
అభివృద్ధి, సంక్షేమం అజెండాగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అడ్డుపుల్లలు వేస్తోందో రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువనేత మరోమారు బయటపెట్టారు. ఐటీ రంగానికి కీలకమైన ఐటీఐఆర్ విషయంలో కేంద్రం తీరును ఇప్పటికే అనేక వేదికలపై బట్టబయలు చేసిన కేటీఆర్ తాజాగా హైదరాబాద్ మహానగర అభివృద్ధి విషయంలో కేంద్రం తీరును బహిరంగంగానే ఎండగట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తలసాని..!!
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలువైన భూమిలో సీఎం క్యాంపు కడుతుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కమీషన్లకు కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని దెప్పిపొడిచారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సీఎం కేసీఆర్ సొంత ఆస్తి …
Read More »మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితరం నాయకుడిగా రామచంద్రారెడ్డికి దేశ వ్యాప్తంగా పేరుందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. సిఎం …
Read More »కార్మికులందరికీ ఈఎస్‌ఐ..సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులతోపాటు, ఇతర కార్మికులందరికీ ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. భవ ననిర్మాణ కార్మికులందరికీ బీమా అమలుచేయాలన్నారు. మేడే తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి కార్మిక సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. కార్మిక సంక్షేమంపై శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు? వారి ఆరో గ్యం, సంక్షేమం, బీమా విషయంలో …
Read More »టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్లకు సీఎం కేసీఆర్ ప్రశంస
ప్రపంచ తెలుగు మహాసభలకు అతిథిగా హాజరవడమే కాకుండా ఆ సమావేశాల సారాంశాన్ని పలువురికి తెలియజెప్పాలనే ప్రయత్నం అభినందనీయమని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల రచించిన పుస్తకాన్ని శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో `తెలుగు భాష ప్రాచీనత- తెలంగాణ తెలుగు సౌరభాలు` గురించి ఎంపీ కవిత ఉపన్యాసించారు. ఈ కీలక ప్రసంగాన్ని …
Read More »