ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి కీలక నేతలతో ఫెడరల్ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.ఈ ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా సీఎం కేసీఆర్ రేపు చెన్నై వెళ్లి డీఎంకే నేతలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో బేగంపేట్ విమానాశ్రయం …
Read More »ఎన్‌ఆర్‌ఐల సహాయం తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది..సీఎం కేసీఆర్
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రభుత్వం ఆదుకుని సహాయం అందిస్తుందని, దీని కోసం రూ.50 కోట్ల నిధితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐఎఎస్ అధికారి నేతృత్వంలో పనిచేసే ఈ సెల్ కు అనుబంధంగా వివిధ దేశాల ప్రతినిధులతో తెలంగాణ ఎన్ఆర్ఐ కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. ఎన్ఆర్ఐ సెల్, …
Read More »కేటీఆర్ నిప్పులాంటి వారు..నిప్పుతో చెలగాటం వద్దు..!!
రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేయడం నిప్పుతో చెలగాటమేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.కేటీఆర్ నిప్పులాంటి వారని, నిప్పుతో చెలగాటం వద్దని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఉత్తమ్ కు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.ప్లీనరీ విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని కమిటీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో …
Read More »సివిల్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు సీఎం కేసీఆర్ అభినందనలు
సివిల్స్ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న మరో తరంలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండడం గర్వకారణమని సీఎం అన్నారు. ఆలిండియా నెంబర్ వన్ ర్యాంకు సాధించిన మెట్ పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లా కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్ …
Read More »హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మరుస్తాం..కేటీఆర్
సిగ్నల్ ఫ్రీ వ్యవస్థలో భాగంగా అండర్ పాస్ ల నిర్మాణంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఇందులో భాగంగా హైటెక్ సిటీ సమీపంలో రూ.25 కోట్లుతో నిర్మించిన మైండ్ స్పేస్ అండర్ పాస్ ను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మరుస్తామని అన్నారు.రూ.23 కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ పనులను చేపట్టామని… …
Read More »రోజూ ఉదయాన్నే అల్లం రసం తాగితే కలిగే అద్భుతమైన లాభాలివే..!
సాధారణంగా మనం రోజు వంటల్లో అల్లం వాడుతూ ఉంటాం.అల్లం వంటలకు రుచినిచ్చే పదార్థంగానే కాక ఇది మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది . ఈ క్రమంలోనే నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం రసం రోజు పరగడుపునే త్రాగడం వలన వయస్సు మీద పడడం కారణంగా వచ్చే …
Read More »వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ మహానగరం తార్నాకలోని ఐఐసీటీలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ యువ శాస్తవేత్త లకు అవార్డులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగానే జరుగుతున్నాయని .. శాస్త్ర, …
Read More »మంత్రి కేటీఆర్‌తో ప్రిన్స్ మహేష్ బాబు.. ఇంటర్వ్యూ మీకోసం..!!
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హోరోగా ,కైరా అద్వాని హిరో యి న్ గా జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది.ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటీవల భరత్ అనే నేను చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ …
Read More »పోచంపల్లిని అభినందించిన సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ ప్రతినిధులతో కొంపల్లి బీబీఆర్ గార్డెన్‌లోని ప్లీనరీ ప్రాంగణం కళకళలాడింది. రాష్ట్రంలోని అన్ని దారులు కొంపల్లి వైపే అన్న తీరులో సందడి వాతావరణం నెలకొన్నది. దారిపొడవునా వెలిసిన ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలతో టీఆర్‌ఎస్ శ్రేణులు సందడి చేశారు. ప్లీనరీ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం మొత్తం గులాబీమయమైంది.నగరంలో …
Read More »రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ప్లీనరీ బంగారు బాటలు వేయబోతుంది..మంత్రి నాయిని
ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సొసైటీలో జరుగుతున్న ప్లీనరీ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్ లోని జలదృశ్యంలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిందని హోంమంత్రి నాయిని …
Read More »