ఎన్టీఆర్ అనగానే నందమూరి తారక రామారావు అని టక్కున చెప్పేస్తాం. ఎఎన్ఆర్… అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పేయచ్చు. కానీ, ఇలా కొందరు ప్రముఖుల పేర్లు పూర్తిగా తెలియనివాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొందరు నిక్ నేమ్ ఫ్యామస్ అయిపోయి… అసలు పేరు తెలియని పరిస్థితి. బాపు బొమ్మ అందరికీ తెలుసు. కానీ బాపూ అసలు పేరు ఎందరికి తెలుసు? ఇక్కడ ఓ 68 మంది తెలుగు ప్రముఖుల అసలు …
Read More »తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ దోపిడీ చేశారు..మంత్రి సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దోపిడి చేశారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..ఎంపీ విజయ సాయి రెడ్డి తప్పుడు సలహా వల్లనే జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారన్నారు.విజయ సాయి రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.సీనియర్ ఐఏఎస్‌లు సతీష్‌చంద్ర, వెంకటేశ్వరరావుపై విజయసాయిరెడ్డి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమిరెడ్డితెలిపారు. see also …
Read More »సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోదరి విమలాబాయి ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.ఈ సందర్భంగా ఆమె పార్థివదేహానికి సీఎం కేసీఆర్ అల్వాల్ లోని ఆమె నివాసంలో నివాళులు అర్పించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు విమలాబాయికి నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లో విమలాబాయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కాగా సీఎం కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక …
Read More »కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..ఎమ్మెల్సీ కర్నె
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీసం ప్రతిపక్ష హోదా కుడా దక్కదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ పదవులు కాపాడుకునేందుకే బస్సు యత చేస్తుందని అయన అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ యాత్రలు చేసినా జనాలు నమ్మరన్నారు .పాలమూరును వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేలా ఆయకట్టును పెంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని …
Read More »కమల్ హాసన్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు..ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు ధన్యవాదాలు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ కమల్ హాసన్ తన రాజకీయ యాత్ర ను ప్రారంబించిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా తాను ఈ రోజు మదురై లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి కేటీఆర్ ను కమల్ ఆహ్వానించారు.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను రాలేకపోతున్నాని.. సినిమాల్లో విజయం సాధించిన విధంగానే రాజకీయాల్లో కమల్ …
Read More »రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్
రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు.ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందన్నారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా …
Read More »2వేల553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు శాఖల్లో భారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.వరంగల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSNPDCL)… 2వేల 553 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టు: జూనియర్ లైన్ మెన్(JLM) సాలరీ: రూ.15,585-రూ.25,200 సర్కిళ్ల వారి ఖాళీలు: వరంగల్-575, కరీంనగర్-674, …
Read More »ప్రతి రోజూ కోడిగుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
సాధారణంగా మనకు చౌక ధరలో అందుబాటులో ఉండే మంచి పోషకాహారం కోడి గుడ్డు. కోడిగుడ్డు ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా బి6 ,బి12 తో పాటు కాల్షియం ,ఐరన్,జింక్ ,పోలిక్ యాసిడ్ ,పాస్పరస్ ,పోటాషియం ,కాపర్,మెగ్నీషియం ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి.అయితే గుడ్డును తినడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మకాంతి పెంచుతుంది.. గుడ్డులో ఉండే మిటమిన్ ఇ.. మీ చర్మ కాంతిని పెంచేందుకు దోహదపడుతుంది.ప్రతీ రోజు …
Read More »రాజకీయ యాత్రను ప్రారంబించిన కమల్‌హాసన్..!
ఈ రోజు నుండి తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే.అన్నటుగానే ఈ రోజు అయన తన యాత్రను రామేశ్వరంలోని అబ్దుల్ కలాం నివాసం నుంచి కమల్‌హాసన్ రాజకీయ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా ఈ రోజు రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు.కాగా ఇవాళ సాయంత్రం మదురైలో జరిగే సభలో పార్టీ పేరును, జెండా వివరాలను ప్రకటించనున్నారు.
Read More »తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి భక్తులు4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 66,814 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,715 మంది తలనీలాలు సమర్పించు కున్నారని టీటీడి అధికారులు తెలిపారు.
Read More »