దేశంలో పన్ను ఎగవేతదారులకు ముకుతాడు వేయడంతో పాటు కొత్తగా మరో వర్గం ప్రజలను పన్ను పరిధిలోకి తీసుకొచ్చి ఆదాయం పన్ను వసూళ్లను పెంచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభు త్వం తహతహలాడుతోంది. సంపన్న రైతులపై పన్నులు విధించడం ద్వారా దండిగా ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని యోచిస్తున్నది. ప్రస్తుతం దేశంలోని 70 శాతం వ్యవసాయ కుటుంబాలు చిన్న కమతాలను (ఒక హెక్టారులోపు విస్తీర్ణమున్న పంట భూములను) కలిగి ఉండగా, …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా..మరో ముందడుగు
కాళేశ్వరం ప్రాజెక్టును డెడ్‌లైన్ లోగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. సుందిళ్ళ,మేడిగడ్డ,అన్నారం పంపు హౌజ్ ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.400 కే.వి,220 కే.వి.లైన్ల పనులు ప్రారంభించారు. జెట్ స్పీడులో పంపు హౌజ్ పనుల నిర్మాణం జరుగుతోంది. 2018 జూన్ కల్లా 8 పంపులు రెడీ అవుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. …
Read More »అక్రమ వలసదారులకు కువైట్ క్షమాభిక్ష..ఉపయోగించుకోవాలని కోరిన మంత్రి కేటీఆర్
కువైట్‌లోని అక్రమ వలసదారులకు ఆ దేశ సర్కారు క్షమాభిక్ష పెట్టింది. ఈనెల 29 నుంచి వచ్చే ఫిబ్రవరీ 22 వరకు ఈ క్షమాభిక్ష అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో అక్రమంగా నివసిస్తున్న, గడువు ముగిసిన వారు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించుకుండా స్వదేశానికి వెళ్లవచ్చని సూచించింది. తిరిగి సంబంధిత నియమ నిబంధనల ప్రకారం తమ దేశానికి రావచ్చునని వెల్లడించింది. కాగా, ఈ నిర్ణయంతో భారతదేశంలోని వేలాది మందికి ఉపయుక్తంగా …
Read More »ప్రజాసంకల్పయాత్ర..71వ రోజు షెడ్యూల్ ఇదే
నెల్లూరు జిల్లాకు చేరుకున్నవైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అక్కడి పార్టీ శ్రేణులు అఖండరీతిలో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో జగన్ సుమారు 20 రోజుల పాటు పర్యటించనున్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో 230 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపధ్యంలో ప్రజాసంకల్పయాత్ర 71వ రోజు షెడ్యూల్ విడుదల అయింది . వైఎస్ జగన్ గురువారం ఉదయం నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నుంచి …
Read More »రంగస్థలం టీజర్ వచ్చేసింది..
రామ్ చరణ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రంగస్థలం టీజర్ వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చెర్రీ టిపికల్ రోల్ పోషించాడని టీజర్‌ని బట్టి అర్ధమైపోతోంది. అందరికీ సౌండ్ వినపడితే.. నాకు మాత్రం కనిపిస్తుందని చెప్పే డైలాగ్, ఆ రోజుల్లో పల్లెటూరు వాతావరణం టీజర్‌లో …
Read More »ఒడిశాలో కూడా మిషన్ భగీరథ అమలు చేస్తాం..
ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజనీర్లు తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇవాళ సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ దగ్గర మిషన్ భగీరథ పనులను నాబార్డ్ ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు.ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలనే తెలంగాణ ప్రభుత్వ ఆలోచన బాగుందని తెలిపారు.సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి వలన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని వారు కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా మిషన్ …
Read More »6వేల కోట్లతో 20 లక్షల మంది దళితులకు లబ్ధి
రాష్ట్రంలో దళితులు ప్రగతిబాట పట్టారు. మూడున్నరేండ్ల క్రితం వరకూ తమకోసం ఓ ప్రభుత్వమంటూ ఉంటుందన్న విషయమే తెలియని దళిత సమాజం ఇవాళ తమకోసం పనిచేసే ప్రభుత్వం అండతో భరో సాగా అభివృద్ధి పథాన నడుస్తున్నది. దళిత కుటుంబాల్లోని వర్తమాన, భవిష్యత్ తరాలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిచిన అభివృద్ధి దారిలో లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నికల నినాదాలకే పరిమితమైన దళితుల …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న సూర్య..!
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.ఒక్క మూవీ హిట్ అయితేనే మైమరిచి కింది స్థాయి పైస్థాయి అని తేడా లేకుండా వ్యత్యాసాలు చూపించే నటులున్న నేటి రోజుల్లో కోలీవుడ్ స్టార్ హీరో ,టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ ను సంపాదించుకొని ..ఒక ప్రముఖ అగ్రనిర్మాత కుమారుడని కొంచెం కూడా గర్వం ప్రదర్శించని సూర్య తనకున్న మంచి మనస్సును చాటుకున్నారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు స్వచ్చంద కార్యక్రమాలను చేస్తూ …
Read More »వీడియో : రైలు ముందు పోజిచ్చాడు..ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది.హైదరాబాద్ లోని భరత్ నగర్ లో రైల్వే ట్రాక్ పక్కన నిలబడి ఎంఎంటీఎస్ రైలు వస్తున్న సమయంలోసేల్ఫీ తీసుకుంటూ శివ అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతడి తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. బాధితుడు లింగంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. …
Read More »గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు ఇవాళ ( బుధవారం ) నాంపల్లి కోర్డు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.గత కొన్ని రోజుల క్రితం ఈయన లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఏ-2 నిందితురాలిగా ఉన్న పార్వతికి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధ, ఆదివారాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు షరతు విధించింది.
Read More »