Home / KSR (page 354)

KSR

24 గంటల కరెంట్ కు రాష్ట్రాలు ఫిదా…అధ్య‌య‌నాల‌పై ఆస‌క్తి

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అందిస్తున్న 24 గంటల విద్యుత్తుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రంగా చరిత్రకెక్కిన తెలంగాణను అన్ని రాష్ర్టాలు అభినందిస్తున్నాయి. దేశ యవనికపై తెలంగాణ ప్రొఫైల్ గ్రాఫ్ విపరీతంగా పెరగ‌డం విశేషం. వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు  24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి వివరాలు …

Read More »

చనాకా -కోరాటా పనులకు డెడ్‌లైన్ ఖ‌రారుచేసిన మంత్రి హ‌రీష్

చనాకా_కోరటా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులునత్త నడకన సాగుతుండటంపై  ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు ఏజెన్సీల పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగని పక్షంలో ఏజెన్సీని మార్చుతామని ఆయన హెచ్చరించారు. చనాకా _కోరాట పనులను మంత్రి శనివారం నాడిక్కడ జలసౌధలో సమీక్షించారు.15 రోజులలో పనుల …

Read More »

సీఎం కేసీఆర్‌కు ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేష‌న్ ప్ర‌శంస‌..!

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి మ‌రో ప్ర‌శంస ద‌క్కింది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ ప్రశంసించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన అభినందన లేఖ రాశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నందుకు తెలంగాణ రైతుల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండి, బోరుబావులపై …

Read More »

లాలూకు మూడున్నరేళ్లు జైలు..!

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు రాంచీ సీబీఐ కోర్ట్ మూడున్నరేళ్ల జైలుశిక్ష వేసింది. దాంతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నది. దాణా కుంభకోణం కేసులో సీబీఐ రాంచీ కోర్ట్ లాలూతో పాటు ఫూల్ చంద్, మహేష్ ప్రసాద్, బేక్ జులియస్, సునీల్ కుమార్, సుశీల్ కుమార్, సుధీర్ కుమార్, రాజారాం …

Read More »

వ్యవసాయాన్ని పండగ చేస్తున్నాం..కడియం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ వరంగల్ జిల్లా పరిషత్ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ జరిగిన జడ్పీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి జడ్పీ సమావేశంలో మాట్లాడారు.విద్యుత్ సమస్యల పైన అసెంబ్లీలో, జడ్పీలో చర్చ …

Read More »

మంత్రి కేటీఆర్ ని కలిసిన గుడి వంశీధర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు గుడి వంశీధర్ రెడ్డి కలిశారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ కు వంశీధర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

Read More »

మన నగరం లక్ష్యం ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో నగరవాసులను భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘మన నగరం’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి నేరుగా స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు జరుగుతున్న అభివృద్ధిపై వారి అభిప్రాయాలను స్వీకరించి, …

Read More »

దమ్మున్ననాయకుడు సీఎం కేసీఆర్..మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు..పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం దగ్గర జరుగుతున్న మిషన్ భగీరథ పనులను మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.మిషన్‌ భగీరథ కింద తాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని సాహసోపేతమైన ప్రకటన చేసిన దమ్మున్న నాయకుడు …

Read More »

గంగిరెద్దుల ఆడించేవారు అపోహ‌లు న‌మ్మ‌వ‌ద్దు..!

గంగిరెద్దుల ఆడించేవారు ఎలాంటి అపోహ‌లు న‌మ్మ‌వ‌ద్దని హైద‌రాబాద్ పోలీస్‌లు స్ప‌ష్టంచేశారు. ఈ విష‌యంలో జ‌రుగుతున్న ప్రచారం నేప‌థ్యంలో  హైదరాబాదు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసు వీవీ శ్రీనివాస రావు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.ఇందులో పూర్తి స్ప‌ష్ట‌త ఇచ్చారు. `సంక్రాంతి పర్వదిన సందర్భంగా గంగిరెద్దుల ఆట ఆడించటం హిందూ సంస్కృతిలో ఒక  వారసత్వ చిహ్నం.  మరియు గంగిరెద్దుల ఆట మన  తెలుగువారి సంప్రదాయం లో ఒక భాగం. ఈ విధముగా …

Read More »

ఈ ఏడాది రాష్ట్రావతరణ కానుక ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్ మెట్రో ఖాతాలో మ‌రో ప్ర‌త్యేక‌త న‌మోదు కానుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా రాబోయే జూన్ 2వ తేదీ ప్రజలకు కానుకగా ఎల్బీనగర్ వరకు మెట్రో మార్గాన్ని ప్రారంభించి తీరుతామని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఎల్బీనగర్ వరకు మెట్రో ప్రారంభించే దిశగా ప్రత్యేక లక్ష్యంతో నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రోను దశలవారీగా అందుబాటులోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat