శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్ , సీఎం కేసీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రి గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన విందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
Read More »తెలంగాణ అభివృద్ధి దిశగా ఎన్నో పథకాలు..ఎమ్మెల్సీ కర్నె
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి…సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. రవీంద్రభారతిలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్-USA ఆధ్వర్యంలో 5వ ప్రవాసి తెలంగాణ దివస్ జరిగింది. మండలి చైర్మెన్ స్వామి గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్రముఖ కవి, రచయి అందె శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని కాపాడటానికి అనేక సంస్థలు పుట్టాయని అందులో టీడీఎఫ్ …
Read More »కాసుల కాన్పుకు చెల్లు..!
సాధారణ ప్రసవాలతో తల్లుల ఆరోగ్యాన్ని కాపాడాలన్న గొప్ప సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో సామాన్యుల జీవితాలను దగ్గరి నుంచి చూసి న నేత తెలంగాణకు పాలకుడు కావడం మూలంగానే ఇలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. భాస్కర్. పెళ్లిళ్లకు, సభలకు డెకరేషన్ చేయడం వృత్తి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. భార్య గర్భవ తి. ఆమెకు గుండె జబ్బు ఉండటంతో …
Read More »రేవంత్..గెలిపించిన ప్రజలను సిగ్గుపడేలా చేయకు
తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలు సిగ్గుపడేలా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ శాసనసభ్యుడు గువ్వల బాలరాజు అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విధానం బాగాలేదని…సభ్య సమాజం దాన్ని ఆమోదించదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాలరాజు మాట్లాడుతూ రేవంత్ తీరుపై మండిపడ్డారు. ఇటువంటి నాయకుల వలన ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పలుచబడిందని అన్నారు. ప్రధాని మోడీపై చేసిన హేయపూరిత వ్యాఖ్యలే …
Read More »ఈ నెల 28నహైదరాబాద్ రానున్న జమ్మూ సీఎం
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సయిద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించనున్నారు ..ఈ నేపధ్యంలో ఈ నెల 28న జమ్ము కశ్మీర్ టూరిజం ప్రమోషన్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె భేటీ కానున్నారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీ ఆర్ తో కలిసి మెహబూబా ముప్తీ లంచ్ చేసే అవకాశముంది.ఈ క్రమంలో ఐటీసీ షెర్టన్ గ్రాండ్ కాకతీయలో జమ్ము సీఎం రాత్రి బస చేయనున్నారు.తిరిగి …
Read More »సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్తున్న కస్తూరిభా విద్యార్థులు
వారంలో రెండు రోజులు మటన్, ఐదు రోజులు చికెన్..ప్రతిరోజూ గుడ్డుతోపాటు స్వీటు, నెయ్యి…ఇదీ కార్పొరేట్ హాస్టల్లలోని మెనూ కాదు. కస్తూరిబా పాఠశాలల్లో త్వరలో అమలయ్యే మెనూ.. ఇప్పటికే సన్నబియ్యంతో భోజనం అందిస్తుండగా..ఇక కార్పొరేట్ విద్యాలయాలకు మిన్నగా అదిరిపోయే ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మౌలిక వసతుల్లో లోటు లేకుండా వేడినీళ్ల కోసం సోలార్ గీజర్లను ఏర్పాటు చేయబోతున్నది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మెనూ ప్రారంభించేందుకు సన్నాహాలు …
Read More »తెలంగాణ పోలీస్..త్రిముఖ వ్యూహం సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహం సక్సెస్ అయిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించింది. నిధులు, నియామకాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న విషయం విదితమే! ఈ క్రమంలోనే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు అనే నినాదాన్ని తీసుకొచ్చింది. పోలీసులంటే ప్రజలు వణికిపోవాల్సి న అవసరంలేదని, ఇతర ప్రభుత్వ శాఖల తరహాలోనే పోలీసు శాఖ ప్రజలకు సేవలు అందించే ఒక …
Read More »ఆర్కే నగర్ ఉపఎన్నిక : దూసుకుపోతున్న దినకరన్
తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితం కాసేపట్లో తేలనుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 258 బూత్‌లలో లెక్కింపు జరుగుతోంది. లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపును పూర్తి చేస్తారు. 18 రౌండ్లలో 252 బూత్‌లలో ఓట్లను లెక్కింపు జరగగా.. ఆఖరి రౌండ్‌లో ఆరు బూత్‌లలో లెక్కింపు …
Read More »నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాక
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.ఈ సందర్బంగా ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ శివార్లలోని హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం …
Read More »పాపం సచిన్ అంటున్న వెంకయ్యనాయుడు..!
క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్‌పై మరోమారు భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తన సానుభూతి తెలిపారు. హైదరాబాద్ రామంతాపూర్ హోమియోపతి మెడికల్ కాలేజీ లో స్వర్ణోత్సవ సంబురాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆయుష్ మందుల ప్రాధాన్యతను గుర్తించారు కానీ తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు రాజకీయ కారణాలు ఏమి లేవని…అవగాహన రాహిత్యం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. మన ఆలోచన జీవన విధానాల్లో మార్పులు రావాలని …
Read More »