పౌరసేవలను నేరుగా ప్రజలకే అందుబాటులోకి తేవడం, సాంకేతిక విప్లవాన్ని ఇంటింటికీ చేరువ చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. మిషన్ భగీరథతో సహా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పనులు వేగంగా పూర్తవడంతో త్వరలోనే పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో సేవలను ప్రారంభించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ దశలోనే అంతర్జాతీయ దిగ్గజాలు పాలు పంచుకునేందుకు వేదికగా మారింది. కేంద్ర ప్రభుత్వంచే ప్రశంసలు పొందుతున్నది. సామాన్యుడు సాంకేతిక విప్లవ …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి సియామ్ ప్రశంసలు
తెలంగాణ ప్రభుత్వంపై మరో ప్రఖ్యాత వేదిక ప్రశంసలు కురిపించింది. సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రతినిధులు మన రాష్ర్ట ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కార్యనిర్వాహక వర్గం సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడారు. నగరంలోని బిర్యానీ, ఆతిథ్యం బాగున్నాయని, అంతకు మించి తెలంగాణ పాలసీలు మరింత బాగున్నాయని కొనియాడారు. దేశంలో ఏడాదికి 28 లక్షల వాహనాలు తయారవుతున్నాయని, ఇందులో 25 లక్షల వాహనాలు స్థానికంగా అమ్ముడవుతున్నాయని సియామ్ ప్రతినిధులు …
Read More »ఇండోర్ టీ20.. భారీ విజయం..టీమిండియాదే సిరీస్
ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 88 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. శ్రీలంకకు చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. 261 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక 17.2 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), …
Read More »టీహబ్ అదుర్స్…ఎన్నారైల ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తీర్చిదిద్దిన టీహబ్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా టీహబ్ అదుర్స్ అని మరో బృందం కొనియాడింది. అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు హైదరాబాద్ టీ-హబ్ ను సందర్శించి స్టార్టప్ ల సీఈఓలతో సమావేశమయ్యారు. పలువురు ప్రతినిధులు స్టార్టప్‌లు,యాప్లలలో ఇన్వెస్ట్ చెయ్యడానికి ఆసక్తి కనబర్చారు. టీ హబ్ అద్భుతంగా ఉందని, అదేవిధంగా ఔత్సాహికులకు మంచి వేదిక అని అమెరికాలోని నివసిస్తున్న ఎన్నారైలు ప్రశంసించారు. తెలంగాణ …
Read More »తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత..మంత్రి కేటీఆర్
మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాల సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) కార్యనిర్వాహక వర్గం సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోషియేషన్ ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ర్టంలో ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి …
Read More »వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తల తాకట్టుపెట్టైన అభివృద్ధి చేసి చూపిస్తా
తెలంగాణ రాష్ట్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా జిల్లాలోని నేలకొండపల్లిలోని సింగారెడ్డిపాలెంలో పేదల కోసం 30 ఇళ్లకు శంకుస్థాపన చేయగా, నిర్మాణం పూరైన 18 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు .. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉన్నంత వరకు ప్రజల కోసమే …
Read More »క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో సీఎం క్రిస్మస్ కేకును కట్ చేయించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… క్రైస్తవ బంధువులందరికీ వందనాలు. పరాధీన స్థితిలో ఉన్న తెలంగాణ స్వాధీన స్థితిలోకి వచ్చి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. …
Read More »సచిన్ కొత్త ప్రయోగం…మంత్రి కేటీఆర్ ప్రశంసలు
క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పార్లమెంటులో సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడేందుకు సిద్ధమవగా ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల నిరంతరాయ ఆందోళనల కారణంగా ఆయనకు అవకాశం దక్కని సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సర్దిచెప్పినప్పటికీ…కాంగ్రెస్ సభ్యులు సహకరించకపోవడంతో సచిన్ తన ప్రసంగాన్ని విరమించుకున్నారు. అయితే యూట్యూబ్ వేదికగా తన భావాలను వినిపిస్తూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ …
Read More »సంధ్యారాణి కుటుంబ సభ్యులను పరామర్శించి.. తక్షణసాయం అందజేసిన మంత్రి తలసాని
రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలో సంధ్యారాణి అనే యువతిపై కార్తీక్ అనే యువకుడు గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాలాపేటలో సంధ్యారాణి మృతదేహానికి నివాళులర్పించి సంధ్యారాణి కుటుంబ సభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.అకౌంటెంట్‌గా పని చేస్తూ కుటుంబ సభ్యులకు …
Read More »భూ రికార్డుల ప్రక్షాళన ఇక పట్టణ ప్రాంతాల్లో
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయభూముల రికార్డుల ప్రక్షాళన దాదాపు పూర్తిచేసిన ప్రభుత్వం ఇక పట్టణాల్లోని భూములు, ఇండ్ల సర్వేపై దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాజధాని హైదరాబాద్ సహా పట్టణాల్లోని భూములు, ఇండ్ల రికార్డులను పక్కాగా రూపొందించాలని నిర్ణయించింది. దీనిపై హైదరాబాద్ కలెక్టర్, రెవెన్యూ అధికారులతో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. భూరికార్డుల ప్రక్షాళనలో పట్టణ ప్రాంతాల్లో ఏ విధానాన్ని అనుసరించాలి? …
Read More »