ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం రేపింది. ఇంగ్లండ్ బృందంలో 4 కరోనా కేసులు వచ్చాయి. సిబ్బంది కాగా.. మరో వీరిలో సహాయక ఇద్దరు ఆటగాళ్ల కుటుంబ సభ్యులని తెలిసింది. ఇక, ఆటగాళ్లలో ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదని తేలిన తర్వాతే.. హోటల్ నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కు అనుమతించారు. ఈ నేపథ్యంలో 3వ టెస్టు రెండో రోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
Read More »అక్కడ ఒక్కరోజే లక్ష కరోనా కేసులు
ఫ్రాన్స్ లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఒకేరోజు ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,04,611 మంది వైరస్ బారిన పడినట్లు ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్యశాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం …
Read More »AP లో 82కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా కొవిడ్తో ఒకరు మరణించారు. 164 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,492 మరణాల సంఖ్య- 14,490 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,60,836 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,166
Read More »TRS Mp రంజిత్ రెడ్డి కి కరోనా
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి నిన్న కరోనా నిర్ధారణ అయిన సంగతి తెల్సిందే..ప్రస్తుతం ఆయన హోంఐసోలేషన్లో ఉన్నారు.. తాజాగా టీఆర్ఎస్ కి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృంద ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఎర్రబెల్లి, రంజిత్ రెడ్డికి పాజిటివ్ రావడంతో అధికార పార్టీ …
Read More »తెలంగాణలో మరో 3ఒమిక్రాన్ కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4450 పెరిగింది. ఇప్పటివరకు 10 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని అధికారులు పేర్కొన్నారు.
Read More »టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టిముట్టిన పోలీసులు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో నేడు ‘రచ్చబండ’ నిర్వహిస్తానని రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లకుండా పోలీసులు అర్ధరాత్రి నుంచి ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. తన ఫాంహౌస్లో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
Read More »త్వరలోనే తెలంగాణలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో వివిధ శాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే 60 వేల ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించగా.. అదనంగా మరో 40 వేల కొలువులు తేలనున్నట్లు సమాచారం. దీంతో 2022లో వరుస నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే శాఖలవారీగా సన్నాహాలు మొదలుపెట్టింది.
Read More »TBJP అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ‘నిరుద్యోగ దీక్ష’ చేయనున్నారు.భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో ఉ.10-సా. 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. తొలుత ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కరోనా వల్ల ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో దీక్షాస్థలాన్ని పార్టీ కార్యాలయానికి మార్చారు. ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ …
Read More »కన్నుల పండుగగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం
కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల …
Read More »కపిల్ దేవ్ రికార్డుపై రవిచంద్రన్ అశ్విన్ గురి
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డుపై గురిపెట్టాడు. 81 టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్.. సఫారీలతో టెస్టు సిరీస్ లో సీనియర్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఈ టెస్టు సిరీస్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి… 195 వికెట్లు పడగొట్టాడు.
Read More »