కేంద్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు బుధవారం డెబ్బై రెండో వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో పతాకవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా జెండా ఆవిష్కరణ క్రమంలో పొరపాటున జెండా నేలకు తాకింది.. అంతలోనే తెరుకున్న అమిత్ షా మళ్ళీ తన పోరపాటును సరిద్దిదుకునే లోపే తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పొస్టు చేశారు . …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయాలతో కాంగ్రెస్‌లో కలవరం…!!
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని గులాబీ దళపతి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలకు కారణం అయింది. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి …
Read More »రాహుల్‌కు అలాంటి ఆరోగ్య సమస్య ఉందంటున్న బీజేపీ లక్ష్మణ్
72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేయగా పార్టీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, మురళీధర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలకు నిజమైన స్వాతంత్ర్య దినోత్సవం ఇదని పేర్కొన్నారు. 70 ఏండ్ల తర్వాత బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మోడీ వల్లనే సాధ్యం అయిందన్నారు. …
Read More »హరీశ్‌రావు కౌంటర్‌కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్తవాలు, అర్ధసత్యాలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు. …
Read More »రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది-సీఎం కేసీఆర్..
72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం సీఎం మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చారిత్రాత్మకమైన గోల్కొండ కోట మీద వరుసగా ఐదవసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలం లోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. నేడు యావత్ దేశానికి …
Read More »ఆగమాగం ప్రవర్తనతో.. నవ్వుల పాలు అవుతున్న రాహుల్..!!
కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిగా చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ తీరును చూసి పార్లమెంటు వేదికగా ఎంపీలు నవ్వుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అటు పిల్లోడు కాదు అటు పెద్దోడు కాదని ఎద్దేవా చేశారు. జుక్కల్‌లో రూ. కోటితో నిర్మించిన “జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుల నివాసము మరియు కార్యాలయాని”కి జహీరాబాద్ MP బిబీ పాటిల్, జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండేతో కలిసి ప్రారంభోత్సవం …
Read More »పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం-ఆస్ట్రేలియా లేటెస్ట్ సర్వే ..!
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మణిహారంలోకి మరో రత్నం చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అధ్యయనంలో తమ దేశ వ్యాపార సంస్థలు వర్తక వాణిజ్యాలు చేయడానికి అత్యంత అనువైన 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు సంపాదించింది. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది అని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ …
Read More »గవర్నర్ కన్నుమూత..!
ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ (90) ఇకలేరు. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో రాయ్‌పూర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. కాగా గవర్నర్ మరణంతో ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు నివాళిగా బుధవారం జరగనున్నస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్రృతిక కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల …
Read More »రానున్న ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు గెలుస్తాం..సీఎం కేసీఆర్
రాబోయే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలతో టీఆర్ఎస్ విజయం సాధించడం తథ్యం అని… ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మేం సిద్ధంగా ఉన్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో మొత్తం 9 తీర్మానాలకు ఆమోదం తెలిపాం అని అన్నారు. మేం …
Read More »రాహుల్ పర్యటన…జైపాల్‌కు అవమానం…కాంగ్రెస్‌లో రచ్చ
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంగా ఆ పార్టీలో కలకలం నెలకొంది. ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు బట్టబయలు అయ్యాయి. నేడు, రేపు రాహుల్ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రాహుల్ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రాహుల్ పర్యటించే ప్రాంతాలను రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక భద్రతాదళం అధికారులు పరిశీలించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్ గాంధీ స్వాగతం తెలిపిన …
Read More »