దేశంలో ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మంది మృత్యుఒడిలోకి చేరుకొంటున్నారు. మిజోరంలో అతి తక్కువ శిశుమరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది శిశువులకు ముగ్గురు మరణిస్తున్నారు. మొత్తంగా ఏడాది నిండకుండానే దేశంలో ప్రతి 36 పసికందుల్లో ఒకరు …
Read More »మంత్రులకు ఒడిషా సీఎం షాక్.. 20 మంది రాజీనామా
ఒడిషాలో రాష్ట్ర మంత్రులకు సీఎం నవీన్ పట్నాయక్ షాక్ ఇచ్చారు. 20 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. సీఎం ఆదేశాలతోనే వారంతా రాజీనామాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రుల తీరుతో బీజేడీ (బిజూ జనతాదళ్) ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందనే ఆరోపణలతో మొత్తం మంత్రివర్గమే రాజీనామా చేయాలని నవీన్ ఆదేశించినట్లు సమాచారం. ఇటీవలే బీజేడీ ప్రభుత్వం మూడేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకుంది. ఐదోసారి సీఎంగా ఉన్న నవీన్.. వచ్చే …
Read More »ఉద్యోగులకు మోదీ సర్కారు షాక్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021-22కుగాను తగ్గించి ప్రతిపాదించిన 8.1 శాతం వడ్డీరేటును ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు ఆమోదించింది. ఈ మేరకు నిన్న శుక్రవారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తెలియజేసింది. ఈపీఎఫ్ పథకం సభ్యులందరికీ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 8.1 శాతం వడ్డీరేటును చెల్లించాలన్నదానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు ఈపీఎఫ్‌వో కార్యాలయం …
Read More »రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పేరిట ఓ రికార్డు
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ స్థానాన్ని తిరిగి అంబానీ ఆక్రమించారు. ఆర్‌ఐఎల్ షేరు ధర రెండు వారాల నుంచి దూడుకు ప్రదర్శించడం, అదానీ గ్రూప్ షేర్లు క్షీణించడంతో ఈ మార్పు జరిగింది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం తాజాగా ముకేశ్ సంపద 99.7 బిలియన్ డాలర్లకు (రూ.7.74 లక్షల కోట్లు) చేరింది. …
Read More »దేశంలో మంకీ ఫాక్స్ కలకలం.. యూపీ బాలికలో లక్షణాలు..
యూపీలో మంకీ ఫాక్స్ వైరస్ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన ఐదేళ్ల బాలికలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. చేతిపై దద్దుర్లు, దురద రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. బాధిత బాలిక నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల కాలంలో ఆ బాలిక కుటుంబం ఎలాంటి విదేశీ పర్యటనలు కూడా చేయకపోయినా మంకీఫాక్స్ తరహా లక్షణాలు రావడంతో అక్కడ …
Read More »దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి ఆరుగురు మృతి చెందారు.. మరో 2,236 మంది బాధితులు కోలుకొని డిశార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,386 ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉందని పేర్కొంది.
Read More »నేపాల్ ఫ్లైట్ యాక్సిడెంట్.. 14 మృతదేహాలు గుర్తింపు
నేపాల్‌లో ఆదివారం అదృశ్యమైన తారా ఎయిర్‌కు చెందిన విమానం ఆచూకీని అక్కడి ఆర్మీ సోమవారం ఉదయం గుర్తించింది. 22 మందితో అదృశ్యమైన విమానంలో దాదాపు అందరూ చనిపోయినట్లు భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఫ్లైట్ కొండల అంచులను ఢీకొట్టినట్లు అంచనా వేస్తున్నారు. కొండలను ఢీకొట్టడంతో విమానం 14,500 అడుగుల లోతులో పడిపోయింది. 22 మందిలో ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను నేపాల్ ఆర్మీ వెలికితీసింది. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. …
Read More »హెచ్ఎడీఎఫ్‌సీ అకౌంట్లలో ఒక్కొక్కరికీ రూ.13కోట్లు.. కస్టమర్లు షాక్
వందలు, వేల రూపాయిలు కాదు.. ఏకంగా రూ.కోట్లలో నగదు అకౌంట్లలో జమ అయింది. ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అకౌంట్లలో ఎవరో వేస్తే అలా రూ.కోట్లలో నగదు జమకాలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్‌తో జరిగింది. ఈ ఘటన తమిళనాడుతో పాటు తెలంగాణలోనూ పలువురికి ఈ అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా అంతేసి అమౌంట్ పడటంతో ఖాతాదారులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి చెందిన ఓ …
Read More »దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా
దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,53,043కు చేరారు. ఇందులో 4,26,11,370 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,586 మంది మరణించగా, మరో 17,087 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 14 మంది మహమ్మారి వల్ల మృతిచెందగా, 779 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »నదిలో పడిపోయినా ఆర్మీ బస్సు.. 7 గురు జవాన్లు మృతి
లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం ఓ నదిలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు మరణించారు. పార్థాపూర్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టార్ వైపు వెళ్తుండగా టుర్టుక్ సెక్టార్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆర్మీ సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను హాస్పిటల్‌కు తరలించారు. 19 మంది ఆర్మీ జవాన్లు గాయపడినట్లు గుర్తించారు. వీరిలో …
Read More »