Home / NATIONAL (page 80)

NATIONAL

దేశంలో భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని గుర్తించారు. మహరాష్ట్ర-1,009, ఢిల్లీ-513, కర్ణాటక-441, రాజస్థాన్-373 కేసులు రాగా.. TS-123, AP-28 కేసులు నమోదయ్యాయి. ఇక, మొత్తం బాధితుల్లో 1,409 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Read More »

తెలంగాణకు అస్సాం సీఎం హిమాంత బిస్వా

తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం రాగా.. ఆదివారం అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలకనున్నారు. అస్సాం సీఎం బండి సంజయ్‌తో కలసి రోడ్డు మార్గంలో వరంగల్‌కు బయలుదేరతారు. మధ్యహాన్నం 12గంలకు ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై బండి సంజయ్‌తో కలసి హిమాంత …

Read More »

కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర

దేశంలో కరోనా భీభత్సానికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్ర కరోనాతో అల్లాడిపోతుంది.రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి.ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఆ రాష్ట్రంలో ఏకంగా 40,925 కొత్త కరోనా కేసులు నమోదవ్వడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దాదాపు 20మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ఒమిక్రాన్ కేసుల్లోనూ మహారాష్ట్ర నే …

Read More »

తమిళనాడులో కరోనా విలయతాండవం

నిన్న మొన్నటివరకు వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాజాగా కరోనా విలయతాండవంతో అయోమయంలో పడింది ఆ రాష్ట్ర ప్రజల జీవితం.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 8,981కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి వైరస్ వల్ల ఏకంగా 8మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 30,817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో …

Read More »

పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం

పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో 173 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న కూడా ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 125 మంది కొవిడ్ పాజిటివ్ గా తేలారు.

Read More »

దేశంలో కొత్తగా 1,41,986 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వణుకు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,41,986 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. 24వేల కేసులు పెరిగాయి. మహమ్మారితో మరో 285 మంది మృతి చెందారు. పాజిటివ్ రేటు ఏకంగా 9.28%కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4లక్షల 72 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ.. మొత్తం 3కోట్ల 44లక్షల మంది వైరస్ నుంచి కోలుకోగా, 4 లక్షల …

Read More »

దేశంలోఒకే రోజు ఏకంగా 1,17,100 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఏకంగా 1,17,100 కొత్త కేసులు వచ్చాయి. కరోనా బారిన పడి మరో 302 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 4,83,178కు చేరింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 7.74%కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న 90వేల కేసుల రాగా.. ఒక్కరోజులో 27వేల కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Read More »

ముంబైలో కరోనా విలయతాండవం

దేశ ఆర్థిక రాజధాని నగరమైన  ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలోనే అక్కడ 20,181 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి నలుగురు మరణించారు. ఈమేరకు  ఎంబీసీ బులెటిన్ విడుదల చేసింది. అక్కడి స్లమ్ ఏరియా ధారావిలో 107 మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం ముంబైలో 79,260 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

రాజస్థాన్ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోట్ కు కరోనా

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోట్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈ సాయంత్రం కరోనా టెస్టు చేయించుకున్నాను. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఇతర సమస్యలు ఏమి లేవు. నాతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి.అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి..అందరూ మాస్కులు ధరించాలని .’ అని ట్వీట్ …

Read More »

చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ ..?

ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో లండన్ కింగ్స్ కాలేజీ దీని లక్షణాలపై అధ్యయనం చేసింది. కొన్ని సింప్టమ్స్ తెలియజేసింది. సాధారణ కోవిడ్ లక్షణాలతో పాటు.. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ కావొచ్చని తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో ఎరుపు, దురద దద్దుర్లను గమనించాలని సూచించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat