ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న బక్రీద్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ జిహెచ్ఎంసి అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సంబంధిత ఏర్పాట్లను సమీక్షించారు. జిహెచ్ఎంసి కమిషనర్ డి .ఎస్. లోకేష్ కుమార్ తో పాటు జోనల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రానున్న బక్రీదు పండుగ ప్రత్యేక పరిస్థితుల …
Read More »తెలంగాణకు వర్ష సూచన
రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని, అలాగే నైరుతి రుతుపవనాలు సైతం చురుగ్గా కదులుతున్నాయని వీటితో ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. …
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని
28.07.2020న తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి ?రాష్ట్రంలో న కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 58906 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 492 మంది ?డిశ్చార్జ్ అయినవారు 43751 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 14663
Read More »ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా,ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు . ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, ఆయన స్థానంలో వీర్రాజును నియమించారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వీర్రాజా ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.
Read More »మహరాష్ట్ర,తమిళనాడులో కరోనా విజృంభణ
దేశంలో కరోనా వైరస్ అంతకంతకు పెరుగుతుండగా, మహారాష్ట్ర తమిళనాడులోఎక్కువ కేసులు నమోదవుతున్నాయి . మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,924మంది కరోనా వైరస్ బారినపడగా.. 227 మంది మృతి చెందారు. ఇక తమిళనాడులో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,20,716 కు చేరింది.
Read More »ముగ్గురికి కరోనా..80వేల మంది తరలింపు
కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ. వియత్నాంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వియత్నాంలో తాజాగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం దనాంగ్ సెంట్రల్ టూరిజం హాట్ స్పాట్ గా ప్రకటించింది. దీంతో అక్కడ నుండి దాదాపు 80 వేల మంది పర్యాటకులను తరలించింది. కాగా రోజుకు విమానాల్లో దనాంగ్ కు దాదాపు 100 వస్తుంటారు.
Read More »60వేలకు దగ్గరలో బంగారం
అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర కొండెక్కింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం సోమవారం ఏకంగా రూ.820 పెరిగి రూ.54,300కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.730 పెరిగి రూ.49,780కి చేరింది. అటు కిలో వెండి ధర ఏకంగా రూ.3,490 పెరిగి రూ.64,700కి చేరింది.
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని..?
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1610 కొత్త కేసులు వెలుగు చూశాయి. 9 మందివైరస్ వల్ల ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరగా 42,909 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.మొత్తం 13,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 480 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇటు ఒక్క GHMC పరిధిలోనే 531 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Read More »అచ్చెన్నాయుడుకి బెయిల్ వస్తుందా…?
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి,టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి… బెయిల్ ఇవ్వాలా? లేదా? అనే దానిపై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 45 రోజులు దాటింది. సాక్ష్యాల సేకరణ కూడా పూర్తయింది అటు ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ …
Read More »ఏపీ ఆర్టీసీలో కరోనా కలవరం
ఏపీ ఆర్టీసీలో కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటివరకు మొత్తం 670 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి కరోనా సోకగా ఇప్పుడు రోజుకు 60-70 మంది సోకుతుంది అత్యధికంగా కడప జోన్లో 260 మంది వరకు కరోనా బారిన పడ్డారు. కాగా ఆర్టీసీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలనే అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో ఎండీ చర్చించనున్నారు.
Read More »