హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు వణికిపోతున్నారు. ఆదివారం నగరంలో మొత్తం 132 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. అయితే పాజిటివ్ వచ్చిన వారిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ తదితర వైద్యశాలలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా తొమ్మిది మంది పోలీసులు, 108 ఉద్యోగి, కొరియర్‌బాయ్, ఆటోడ్రైవర్ ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. వీరిని చికిత్స …
Read More »కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి
కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్‌చానల్ జర్నలిస్టు దడిగె మనోజ్‌కుమార్ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్ మనోజ్‌కుమార్ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన మనోజ్‌కుమార్ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్‌చానల్ క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్‌కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం …
Read More »మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారు
మృగశిర కార్తె ప్రవేశం రోజు ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ఫ్రైయ్యో చేసుకొని ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు. మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు. మృగశిర కార్తె ప్రవేశం రోజు చేపలకు భళే గిరాకీ …
Read More »కరోనా కేసుల్లో 5వ స్థానంలో భారత్
భారత్ దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో తొమ్మిది వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది.గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.దీంతో మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,46,628 కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ దాటి ఐదో స్థానంలో నిలిచిందని జాన్ హప్ కీన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.ప్రస్తుతం అమెరికా,రష్యా,బ్రెజిల్,యూకే మొదటి స్థానంలో …
Read More »కరోనా కేసుల్లో భారత్ రోజుకో రికార్డు
భారత్ దేశంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రోజుకో రికార్డును తన సొంతం చేసుకుంటుంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.గత ఐదు రోజుల్లో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. జూన్ 7న మొత్తం కేసులు 9,971 జూన్ 6న మొత్తం కేసులు 9,887 జూన్ 5న మొత్తం కేసులు 9,851 జూన్ 3న మొత్తం కేసులు …
Read More »ఏపీ సచివాలయంలో కరోనా కలకలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మరో ఐదుగురికి కరోనా సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది.దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచారు. మరోవైపు సచివాలయంలోని వివిధ బ్లాకులను శానిటైజ్ చేయిస్తున్నారు.
Read More »కరోనా ఆసుపత్రిగా నిమ్స్
తెలంగాణలో కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవడం మొదలైనప్పటినుండి, అంటే దాదాపుగా మూడునెలలుగా గాంధీ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మరెక్కడా చికిత్స లేకపోవడం, కేవలం గాంధీ మాత్రమే అందుబాటులో ఉండడం అన్ని వెరసి వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ ను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ రెండు వందల పడకలను …
Read More »కార్యకర్త కుటుంబానికి మంత్రి హరీశ్ బీమా అందజేత
టీఆర్‌ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్తకు, కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన పోతరాజు అఖిల్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో మృతుడికి ప్రమాద బీమా వర్తించింది. ఇందుకు సంబంధించి రూ. 2 లక్షల చెక్కును మంత్రి హరీశ్ నేడు మృతుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »మీరా చోప్రా ఫిర్యాదు…మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!!
సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల సమస్యపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది నటి మీరా చోప్రా. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనపై అసభ్యకర కామెంట్లు, ట్వీట్లు చేస్తున్నారని మీరా చోప్రా ఫిర్యాదు చేసింది. ఈ విషయమై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళింది. తన ట్వీట్‌లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నానని మీరా చోప్రా …
Read More »పాముల పార్కు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ఆయన …
Read More »