హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. …
Read More »అత్యున్నత పదవుల్లో రైతుబిడ్డలు ఉండటం ప్రజల అదృష్టం: కేటీఆర్
హైదరాబాద్: శాసన మండలి ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్ హసన్ జాఫ్రి ప్రకటించారు. గుత్తా మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డిని మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఛైర్మన్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. …
Read More »టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని
విజయవాడ: బడ్జెట్పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బాల వీరాంజనేయ స్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ సభ్యుల సస్పెన్షన్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. …
Read More »RRR రిలీజ్.. జగన్‌తో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య భేటీ
అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. త్వరలో RRR సినిమా రిలీజ్ కానుంది. మార్చిన 25 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో RRR బెనిఫిట్‌షోలకు పర్మిషన్, సినిమా టికెట్ ధరలపై సీఎంతో …
Read More »తెలంగాణలో ‘కారు’స్పీడ్‌లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్
హైదరాబాద్: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్‌ప్రైజ్ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో అసద్ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్‌యాదవ్ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్‌లో ఉందని …
Read More »RCB కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు
ఈ నెల ఇరవై తారీఖున నుండి మొదలుకానున్న ఐపీల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ ఎంపికయ్యాడు. బెంగళూరులో జరిగిన Unbox eventలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ ప్రకటన చేసింది. డుప్లెసిస్ సౌతాఫ్రికాకు 115 మ్యాచ్ కెప్టెన్సీ వహించాడు. ఇందులో మొత్తం 81 మ్యాచ్ లు గెలిచింది. ఇది వరకు సారథిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి …
Read More »సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ‘మళ్లి కూయవే గువ్వ.. మోగిన అందెల మువ్వ’, ‘మనసా నువ్వెండే చోటే చెప్పమ్మా’, ‘గలగల పారుతున్న గోదారిలా’ లాంటి ఎన్నో హిట్ సినిమా పాటలెన్నో రాశారు. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, యాస, భాషను ప్రపంచానికి …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి తుమ్మల క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కి చెందిన నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కు రెబల్‌గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు వచ్చే …
Read More »ఆప్ అధినేతకు అరవింద్ కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు చెప్పని వాళ్లు వీళ్లే.. ఎందుకు..?
సహజంగా ఏ ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాధిస్తే ఆ పార్టీ అధినేతకు ఆ పార్టీ తరపున గెలుపొందిన నేతలకు అభినందనలు వెల్లువెత్తుతాయి.ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి,అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కుట్రలు చేసిన బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి భారీ మెజారిటీతో ఆమ్‌ఆద్మీ పార్టీ …
Read More »వెస్టిండీస్ పై టీమిండియా విమెన్స్ ఘన విజయం
విమెన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో టీమిండియా విమెన్స్ జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన …
Read More »