ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు (102) కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన కూతురు నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో జన్మించిన ఈయన.. 1967, 1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్య వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. 1983లో దివంగత మాజీ ముఖ్యమంత్రి …
Read More »ప్రేమలో పడ్డ అనన్య పాండే
తాను ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. కొన్నిరోజులుగా హీరో ఇషాన్ ఖట్టర్తో ఈ భామ సన్నిహితంగా ఉంటోంది. దానిపై తొలిసారిగా నోరు విప్పింది. అయితే అతడి పేరు మాత్రం చెప్పలేదు. ‘నా మీద అతడి ప్రభావం ఎక్కువగా ఉంది. అతనిది ప్రేమించే వ్యక్తిత్వం. నాకెప్పుడూ సహకరిస్తూ ఉంటాడు. అతడిని ప్రేమిస్తున్నా. నేను లక్కీ’ అని చెప్పింది. వీరిద్దరూ ఖాలీ పీలి సినిమాలో కలిసి …
Read More »క్యారెట్ తింటే ఎన్ని లాభాలో..
క్యారెట్ తింటే ఎన్ని లాభాలో .. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 2. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. 3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 4. కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా చేస్తుంది. 5. క్యారెట్లను నేరుగా తినొచ్చు లేదంటే జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిదే.
Read More »రికార్డులు బద్దలుకొట్టిన టీమిండియా
శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత భారత్ పలు రికార్డులను అధిగమించింది.… అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంకపై 17వసారి గెలిచి, ఒక జట్టుపై అత్యధిక మ్యాచుల్లో నెగ్గిన జట్టుగా టీమిండియా నిలిచింది. సొంత గడ్డపై భారతికిది 40వ గెలుపు. 39 విజయాలతో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు(12) సాధించిన జట్లుగా అఫ్గానిస్తాన్, రొమేనియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.
Read More »ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తా-రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, మరో కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Read More »మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు …
Read More »కాళేశ్వరం ముక్తిమర్గం ..యాదాద్రి భక్తిమార్గం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ముక్తి మార్గం, యాదాద్రి పునర్నిర్మాణంతో భక్తిమార్గాన్ని భావితరాలకు గుర్తిండిపోయేలా సీఎం కేసీఆర్ రెండు గొప్ప పనులు చేశారని సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి కొనియాడారు.ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం నూతన ఆలయాన్ని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సైతం యాదాద్రీశుడిని దర్శించుకొన్నారు. సీఎం కేసీఆర్.. అత్యంత పురాతనమైన యాదాద్రిని పునర్నిర్మించి గొప్ప గౌరవాన్ని సంపాదించుకొన్నారని కొనియాడారు. ఈ …
Read More »ఒక్క ట్వీట్ తో రష్యాకు ముచ్చెమటలు పుట్టించిన ఎలాన్ మస్క్
ఇప్పటికే తమ దాడులతో రష్యాకు ముచ్చెమటలు పుట్టిస్తున్న ఉక్రెయిన్ కు మద్ధతుగా అమెరికా ,ఈయూ లాంటి దేశాలు అండగా నిలబడుతున్నాయి. ఉన్నకొద్ది పాటి సైన్యంతో రష్యాకు భారీ నష్టాన్ని మిగిలుస్తుంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగే విధంగా దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ దేశ ఉప ప్రధాని ఫెడరవ్ సాయం చేయాలంటూ ఎలాన్ మస్క్ కు ట్వీట్ చేశాడు.వెంటనే స్పందించిన ఎలాన్ …
Read More »రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాక్..?
గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్న రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాకిచ్చాయి. ఇప్పటికే తమ స్థాయికి తగ్గట్లు రష్యా దాడులను తిప్పికొడుతూ ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిలుస్తున్న ఉక్రెయిన్ కు అండగా అమెరికా,ఈయూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన అత్యంతకీలకమైన స్విఫ్ట్ నగదు చెల్లింపుల వ్యవస్థ నుండి …
Read More »రష్యా ఆ ఆస్త్రం ప్రయోగిస్తే ఉక్రెయిన్ మరో నాగసాకి అవుతుందా..?.. దానికంత పవర్ ఉందా..?
నాటోను బూచిగా చూపించి రష్యా దేశం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత నాలుగురోజులుగా భారీమారణ హోమం సృష్టిస్తున్న సంగతి విదితమే. అయిన కానీ ఉక్రెయిన్ తమ స్థాయికి మించి రష్యా దళాలను ఎదుర్కుంటూ దాడులను తిప్పికొడుతుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ పై అణ్వాయుధాలతో దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సేనను ఆదేశించినట్లు …
Read More »