తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్‌కు దక్కిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, …
Read More »CM KCR పై బండి సంజయ్ ఫైర్
జనగామ సభలో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన విమర్శలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘కేసీఆర్ చెల్లని రూపాయి. బహిరంగ సభలో బీజేపీపై విమర్శలు కాదు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో.. ఏం పీకారో చెప్పాలి. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఓడిపోతాననే భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు’ అని బండి ఫైర్ అయ్యారు.
Read More »Apకి ప్రత్యేక హోదాపై కీలక అడుగు
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఈనెల 17న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ సీఎస్కు సమాచారం అందింది. హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
Read More »అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానం
తెలంగాణ నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధిస్తామన్న 2001 నాటి కేసీఆర్ ప్రకటనను గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్న సీఎం కేసీఆర్ సాహసోపేత ప్రకటనపై గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. అదే తెలంగాణ నేడు కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »‘మహాన్’ లో హీరోయిన్ లేదా..?
విక్రమ్ నటించిన ‘మహాన్’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు ఎక్కడా హీరోయిన్ వాణీ భోజన్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ప్రమోషన్లలో భాగంగా వాణీ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసినా మూవీలో ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించలేదు. అయితే సినిమా రన్లైమ్ ఎక్కువ కావడంతోనే వాణీ సీన్స్ కట్ చేశారని కొందరు, మహాన్-2లో కనిపించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.
Read More »జూనియర్ ఎన్టీఆర్ పై హాట్ భామ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ‘ఊసరవెల్లి’ లో నటించిన అందాల రాక్షసి హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్, నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆలియా …
Read More »మత్తెక్కిస్తున్న కీర్తి సురేష్ అందాలు
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇంతకాలం డీసెంట్ రోల్స్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఆమె కూడా గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. ఇందుకు కారణం వరుస ఫ్లాపులతో కాస్త రేసులో వెనకబడుతుండటమేనని టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా కీర్తి నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం లేదు. ‘మహానటి’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ, క్రేజ్ వచ్చేసింది. దాంతో ఎడాపెడా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సినిమాలు కమిటయ్యారు. …
Read More »హీరో విశాల్ కు గాయాలు
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’. ఈ మూవీ షూటింగ్‌లో ఆయన గాయపడ్దారు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించే ఈ సినిమాతో ఏ.వినోద్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా షెడ్యూల్‌లో …
Read More »TRSలోకి భారీగా చేరికలు
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ సమక్షంలో ఏనేకుంట తండాకు చెందిన బానోతు సుందర్, రామచంద్ర, బిచ్చా, సర్వన్‌తో పాటు మరో 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే కిశోర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌కు …
Read More »యూపీ ఎన్నికలు- మంత్రిపై కేసు నమోదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ అభ్యర్థి, మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. కోవిడ్19 ప్రోటోకాల్ ప్రకారం బైరియా అసెంబ్లీ నియోజకవర్గంలో 144 సెక్షన్ కింద నిషేధిత ఆదేశాలు ఉన్నా.. మంత్రి స్వరూప్ వాటిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్తి జై ప్రకాశ్ ఆంచల్‌పైన కూడా ఇదే తరహా కేసు బుక్కైంది. బీజేపీ, ఎస్పీ అభ్యర్థులు ఇద్దరూ ప్రచారం కోసం …
Read More »